twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిస్తున్న రష్మిక మందన్న.. అలా అయితేనే ఓకే లేదంటే కుదరదు

    |

    ప్రస్తుతం యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న జోరు చూస్తుంటే.. ఇక ఆమెను ఢీకొట్టే హీరోయిన్ ఇప్పట్లో కనిపించదేమో అంటున్నారు ప్రేక్షకులు. 'ఛలో' అంటూ టాలీవుడ్ గడప తొక్కిన ఈ కన్నడ భామ వరుస సినిమాలతో బిజీ అయింది. కెరీర్‌లో ఎక్కడా వెనుతిరిగి చూసిందేలేదు. మొదటి సినిమాను చిన్న హీరో నాగశౌర్యతో చేసిన రష్మిక.. ఆ తర్వాత మీడియం రేంజ్ హీరో విజయ్ దేవరకొండతో జోడీ కట్టి 'గీత గోవిందం' రూపంలో భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమె చేసిన రొమాన్స్, అదేవిధంగా సన్నివేశాలకు తగ్గట్లుగా చూపిన అభినయం అగ్ర దర్శకులు, అగ్ర హీరోల దృష్టిలో పడింది. వెంటనే ఆమెకు అవకాశాల పంట పండింది.

    ఈ నేపథ్యంలో రష్మిక మందన్న డిమాండ్ కూడా బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది. జెట్ స్పీడ్ లో కెరీర్ గ్రాఫ్ దూసుకుపోతోంది కాబట్టి ఇప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని డిసైడ్ అయిందట రష్మిక. ఈ మేరకు తన కొత్త సినిమాలకు కోటికి పైగా రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట రష్మిక మందన్న. అంతిస్తేనే ఓకే చెప్తానని, లేదంటే కుదరదని నిర్మొహమాటంగా చెప్పేస్తోందట ఈ కన్నడ భామ. దీంతో అనతికాలంలోనే అమ్మడి డిమాండ్ చూసి షాకవుతున్నారట దర్శకనిర్మాతలు.

    Rashmika Mandanna Demands Huge Remuneration

    ఇక రష్మిక మందన్న లేటెస్ట్ సినిమాల విషయానికొస్తే.. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన 'డియర్ కామ్రేడ్' సినిమాలో మరోసారి విజయ్ దేవరకొండతో లిప్‌లాక్స్ చేసింది రష్మిక. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమా, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు కమిట్ అయింది రష్మిక మందన్న. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న 'సరిలేరు నీకెవ్వరు' మరో రెండు మూడు రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.

    English summary
    Rashmika Mandanna is doing now Dear Comrade movie with Vijay Deverkonda. And she confirmed with Mahesh Babu's 26th movie SariLeru Neekevvaru. Now she was demanding one crore remmunaretion for a movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X