రష్మిక మరో షాకింగ్ నిర్ణయం.. ఆ హీరోకు ఝలక్.. తప్పుకోడానికి కారణం అదేనట.!

By Manoj Kumar P

రష్మిక మందన్నా.. అందం, అభినయంతో రాణిస్తున్న హీరోయిన్. సైలెంటుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా.. ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీ అయిపోయింది. ఇటీవల విజయ్ దేవరకొండతో 'డియర్ కామ్రేడ్' అనే సినిమా చేసింది. ఇది మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె చేసిన లిల్లీ అనే క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ క్రమంలోనే ఆమె వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక ఓ బడా మూవీ నుంచి తప్పుకోవడం కలకలం రేపుతోంది. అది కూడా బాలీవుడ్ ఆఫర్ కావడంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎందుకిలా చేసింది..? పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 కన్నడ పిల్ల ఫుల్ బిజీ

కన్నడ పిల్ల ఫుల్ బిజీ

కన్నడ పిల్ల రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు'తో పాటు నితిన్‌తో ‘భీష్మ' అనే సినిమాల్లో నటిస్తోంది. అలాగే సుకుమార్ - అల్లు అర్జున్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు సైతం చర్చల దశలో ఉన్నాయని సమాచారం.

బాలీవుడ్‌లోనూ అడుగు

బాలీవుడ్‌లోనూ అడుగు

నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ' సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడా సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీలోనూ గౌతమ్ తిన్ననూరే తెరకెక్కిస్తున్నారు. ఈ రీమేక్‌లో హీరోయిన్‌గా రష్మికను తీసుకుంటున్నారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇందులో షాహీద్ కపూర్.. నాని పాత్రను చేస్తున్నాడు.

నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నాడు

నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నాడు

జెర్సీ రీమేక్ కోసం హీరో షాహీద్ కపూర్ నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నాడు. క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో అతడు దాదాపు రెండు నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి షాహీద్ తన గత చిత్రం ‘కబీర్ సింగ్' కూడా తెలుగు నుంచి రీమేక్ చేసిన సినిమానే. ఇది బాలీవుడ్‌లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సినిమా నుంచి తప్పుకుంది

సినిమా నుంచి తప్పుకుంది

ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు షాక్ తగిలింది. తెలుగు జెర్సీ సినిమాలో నాని భార్యగా నటించిన శ్రద్దా శ్రీనాథ్ పాత్రను హిందీలో పోషించబోతున్న రష్మిక.. సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకుంది. దీంతో చిత్ర యూనిట్ మరో హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

 అసలు కారణం డేట్స్ కాదట

అసలు కారణం డేట్స్ కాదట

ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకోవడం వెనుక బలమైన కారణం ఉందని కూడా తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలకు డేట్స్ సర్ధుబాటు చేయలేక ఆమె తప్పుకుందని మొదట అనుకున్నప్పటికీ.. దాని వెనుక కారణం మరొకటి ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం ఆమె భారీ మొత్తం అడిగిందని, అది వర్కౌట్ కాకపోవడంతో తప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Recommended Video

#CineBox: Tapsee Strong Counter To Reporter | Prabhas Fans Urges For #Prabhas20 Update
రీమేక్ కోసం క్యూ కడుతున్నారు

రీమేక్ కోసం క్యూ కడుతున్నారు

తెలుగులో ఘన విజయం సాధించిన ‘జెర్సీ'ని రీమేక్ చేస్తామంటూ ఇతర భాషలకు చెందిన చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ముందుకు వచ్చారు. క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో దీనిపై అన్ని ఇండస్ట్రీలు కన్నేశాయి. అలాగే, మనదేశంలో క్రికెట్‌కు ఎంతో మంది అభిమానులు ఉండడంతో ఈ సినిమా ఏ భాషలో తీసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో వారంతా చిత్ర యూనిట్‌తో సంప్రదింపులు సైతం జరిపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X