ఎన్టీఆర్‌తో పాన్ ఇండియా బ్యూటీ.. సొంత పిల్లకే ఓటేసిన ప్రశాంత్ నీల్
టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లలో సినిమాలు రావాలని ఆయనా స్టార్ల అభిమానులతో పాటు సినీ ప్రియులంతా కోరుకుంటూ ఉంటారు. అలాంటి కలయికల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జోడీ ఒకటి. వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం 'దేవర' అనే హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయింది. అలాగే, బాలీవుడ్‌లో 'వార్ 2' మూవీ షూటింగ్‌లోనూ అతడు పాల్గొంటున్నాడు. ఈ రెండూ పట్టాలపై ఉండగానే ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుపై కూడా ఫోకస్ చేస్తున్నాడు.

హై పవర్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను గత ఏడాది ఏప్రిల్‌లో కానీ, మేలో కానీ మొదలు పెట్టే ఛాన్స్ ఉందని చెప్పారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది ఆలస్యం అవుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే ఈ సినిమాను ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్నారని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది.
జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతున్న నేపథ్యంలో.. ఇందులో నటించే హీరోయిన్ గురించి చాలా రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె, శ్రద్దా కపూర్, కియారా అద్వానీ, ఆలియా భట్ సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఇలా ఇప్పుడు అసలైన న్యూస్ లీకైంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా మరో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తుందని తెలిసింది. బాలీవుడ్ వాళ్ల కంటే దేశ వ్యాప్తంగా పేరొందిన లోకల్ బ్యూటీకే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఓటు వేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే రష్మిక ఎంపిక గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందబోతుంది.


Click it and Unblock the Notifications











