For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సైలెంట్ గా ఫ్లైట్ ఎక్కిన రష్మిక.. ఆ హీరో కోసమేనంటూ ప్రచారం.. అసలు విషయం ఏంటబ్బా?

  |

  సినీ ఇండ‌స్ట్రీలో హిట్ పెయిర్‌గా టాక్ వస్తే వారికి ఉండే డిమాండ్ బాగుంటుంది కానీ ఆ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ పెద్ద ఎత్తున రూమర్లు కూడా వస్తుంటాయి. అలా రష్మిక మందన్న విజయ్ దేవరకొండ జోడి మీద కూడా లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్లు వచ్చాయి. విజయ్ కారణంగా రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని కూడా అన్నారు. అయితే తాజాగా వీరి గురించి కొత్త ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..

   ఆ సస్పెన్స్ ఏంటబ్బా?

  ఆ సస్పెన్స్ ఏంటబ్బా?

  అసలు విషయం ఏంటంటే రష్మిక పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా రష్మిక మందన్న తన పాస్‌పోర్ట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అలా పోస్ట్ చేయడమే కాక ఆ ఫొటోకు ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది, "ఈసారి మీకు చాలా దూరంగా ఉంది, కానీ త్వరలో తిరిగి వస్తుంది." అంటూ మళ్లీ తన సెల్ఫీని పోస్ట్ చేసింది. ఎక్కడికి వెళుతున్నానో గెస్ చేయమని కూడా తన ఫాలోవర్స్ ను కోరింది.

  దేవరకొండ కోసం అమెరికాకు?

  దేవరకొండ కోసం అమెరికాకు?

  అయితే రష్మిక నిజంగా ఎక్కడికి వెళ్లిందని సంగతి తెలియదు కానీ ఆమె విజయ్ దేవరకొండను కలవడానికి అమెరికా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది ఈ విషయాన్ని బాలీవుడ్ టాబ్లాయిడ్ పింక్‌ విల్లా తన కధనంలో పేర్కొంది. పింక్‌ విల్లా నివేదిక ప్రకారం, ఈ కూర్గ్ బ్యూటీ యుఎస్‌లో లైగర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న దేవరకొండను కలవనుందని అంటున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

  అప్పుడప్పుడు

  అప్పుడప్పుడు

  గతంలో దేవరకొండ, రష్మిక జోడీ కట్టిన సంగతి తెలిసిందే. గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్ సినిమాలలో వారి కెమిస్ట్రీ అద్భుతమైన విధంగా పండడంతో వారు ఆన్-స్క్రీన్ సూపర్ క్యూట్ పెయిర్‌గా పరిగణించబడుతున్నారు. ఏదేమైనా వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్ కూడా మంచి స్నేహితులు, అప్పుడప్పుడు ముంబై లాంటి చోట్ల వారు కలిసి ఉన్నప్పుడు ఫోటో గ్రాఫర్లు క్లిక్ మనిపించారు కూడా.

   రకరకాల పుకార్లు

  రకరకాల పుకార్లు

  ఇక తమ రిలేషన్ షిప్ గురించి ఎప్పటికప్పుడు మీడియాలో కథనాలు, ఊహాగానాలు వస్తున్నప్పటికీ, వీరిద్దరూ ఎప్పుడూ మేము కేవలం స్నేహితులు మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని చెబుతూనే ఉంటారు. అయితే ఒక రకంగా ముంబైకి బేస్ మార్చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక అక్కడ తరచుగా కలవడం, ఒకే జిమ్‌లో వర్కౌట్‌లు చేయడం కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వస్తున్న ఊహాగానాలకు ఆజ్యం పోసుకున్నట్టు అవుతున్నాయి.

  Recommended Video

  Actor Kamal Haasan Tests Covid Positive || Filmibeat Telugu
  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  ఇక సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో కరణ్ జోహార్ సపోర్ట్ తో "లైగర్‌" మూవీ ద్వారా విజయ్ తన పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. రష్మిక విషయానికి వస్తే ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ మాగ్నమ్ ఓపస్ మూవీ "పుష్ప" చిత్రం విడుదలకు కోసం సిద్ధంగా ఉంది. అలాగే బాలీవుడ్‌లో "మిషన్ మజ్ను", "గుడ్‌బై" సినిమాలు చేస్తోంది. మరోవైపు

  English summary
  rashmika mandanna flied to abroad and rumours started
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X