అతని చేతిలో ఘోరంగా మోసపోయిన రష్మిక మందన్న.. అసలేం జరిగిందంటే?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'ఛలో' చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయిన రష్మిక మందన్నా ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ సూపర్ పాపులర్ అవుతోంది. అయితే సినీ స్టార్ సెలబ్రిటీలు అయినా సాధారణ వ్యక్తులైన సొంత మనుషుల చేతిలో దారుణంగా మోసపోతారు. అలాంటి మోసమే తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్నకు జరిగిందనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
నేషనల్ క్రష్ గా మారి:కన్నడ బ్యూటి రష్మిక మందన్నా చిన్న సినిమాలతో హిట్ కొట్టి తర్వాత నేషనల్ క్రష్ గా మారింది. తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. నాగ శౌర్య నటించిన 'ఛలో' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది రష్మిక. ఆమె చేసిన తొలి చిత్రానికి మంచి విజయం దక్కింది. ఈ సినిమా హిట్ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుని సత్తా చాటింది ఈ గ్లామరస్ బ్యూటి.

స్టార్ హీరోలతో:ఛలో తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న నటించిన 'గీత గోవిందం' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతేకాకుండా ఈ సినిమాతో ఆమెకు యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో రష్మిక స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక మహేశ్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు', నితిన్ 'భీష్మ', 'పుష్ప', 'సీతా రామం', 'వారసుడు' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో మరింత పాపులర్ అయింది.
రీల్స్ క్రియేట్ చేసి:ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మాత్రం దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది రష్మిక. ఇందులో శ్రీవల్లిగా యావత్ ప్రేక్షకులను తన నటనతో ఆకర్షించింది. ముఖ్యంగా సామీ సామీ అనే పాటకు రష్మిక వేసిన స్టెప్పులు మరింతగా హైలెట్ అయింది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ ను ఎంతోమంది నెటిజన్లు రీల్స్ ద్వారా రీక్రియేట్ చేశారు. దీంతో ఆమెకు హిందీలోను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

హిందీ చిత్రాల్లో:బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కలిసి డీ గ్లామర్ రోల్ లో గుడ్ బై మూవీ చేసింది రష్మిక మందన్న. అనంతరం యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను సినిమా చేసింది. ఓటీటీలో విడుదలైన ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. బైలింగువల్ మూవీ వారసుడు కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇలా తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీల్లో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది ఈ గ్లామర్ బ్యూటి.

3 ప్రాజెక్ట్స్:ప్రస్తుతం రష్మిక మందన్న చేతిలో వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో పుష్ప 2 మూవీతో పాటు రెయిన్ బో అనే సినిమా కూడా ఉంది. లేడీ ఒరియెంటెడ్ గా వస్తున్న రెయిన్ బో సినిమాలో శాకుంతలం సినిమా హీరో దేవ్ మోహన్ సరసన రష్మిక నటించనుంది. అలాగే సందీప్ వంగా-రణ్‌బీర్ కపూర్ కాంబో యానిమల్ లో కూడా రష్మిక నటిస్తోంది.

మోసపోయినట్లు టాక్:ఇదిలా ఉంటే తాజాగా తన వద్ద ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న మేనేజర్ రష్మిక మందన్నను దారుణంగా మోసం చేశాడని ఓ వార్త నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఆమె నుంచి ఆ మేనేజర్ సుమారు రూ. 80 లక్షలు దొంగలించాడని సమాచారం. దీంతో అతన్ని ఉద్యోగం నుంచి రష్మిక తొలిగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై రష్మిక బయటకు చెప్పకుండా మౌనంగానే ఉంది. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో తెలియలేదు.


Click it and Unblock the Notifications











