Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఛాన్స్ దొరికింది.. మరి రష్మిక మందన్న క్యాచ్ చేస్తుందో! లేక?
Recommended Video
కిరాక్ పార్టీ సినిమాతో తెరంగ్రేటం చేసిన కన్నడ భామ రష్మిక మందన్న.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. నాగశౌర్యతో కలిసి 'ఛలో' అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలు పట్టేసింది. తన గ్లామర్ లుక్ యూత్ ఆడియన్స్‌ని వలలో వేసుకోవడంతో ఈ భామకు భలే డిమాండ్ ఏర్పడింది. సౌత్ లోని అన్ని భాషల దర్శక నిర్మాతలు రష్మీకి వైపే చూస్తున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ భామకు మరో అద్భుత అవకాశం తలుపుతట్టిందని తెలుస్తోంది.
తెలుగు, కన్నడ సినిమాల్లో ఫుల్ బిజీ
అమ్మడి అందానికి తగ్గ అభినయానికి తెలుగు, కన్నడ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ రెండు భాషల్లోని స్టార్ హీరోలు సైతం రష్మిక మందన్నతో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మికకు తమిళం నుండి కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవలే కార్తి సరసన ఓ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది రష్మిక.
స్టార్ హీరోతో రొమాన్స్
ఇప్పటికే స్టార్ హీరో కార్తితో సెట్స్ పై రొమాన్స్ చేస్తున్న రష్మిక మందన్నకు మరో స్టార్ హీరో సరసన రొమాన్స్ చేసే అవకాశం దక్కిందట. తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిందని తెలుస్తోంది. ఈ విషయమై ఆ చిత్ర దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించారని సమాచారం. ఇది ఓకే చేస్తే మరో స్టార్ హీరో ఒడిలో రష్మిక కూర్చొనుందన్నమాట.
మరోసారి రొమాంటిక్ మూడ్ లోకి
ఇప్పటికే తెలుగు సినిమా పరంగా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకుంది రష్మిక. గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమె చేసిన రొమాన్స్ యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో మరోసారి ఆమెతోనే డియర్ కామ్రేడ్ రూపంలో రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళిపోయాడు విజయ్ దేవరకొండ. ఇందులో వాళ్ళిద్దరి రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండనుండో డియర్ కామ్రేడ్ టీజర్ చెప్పేసింది.
మహేష్ బాబు కూడా వదల్లేదు
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రష్మిక మందన్నను వదల్లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న తన 26 వ సినిమాలో రష్మిక హీరోయిన్ అని చెప్పగానే వెంటనే ఓకే అనేశాడట మహేష్. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. చూడాలి మరి ఈ కన్నడ భామ ముందు ముందు ఇంకెన్ని ఛాన్సులు పట్టేస్తుందో!