Just In
Don't Miss!
- News
'డ్యాన్స్'పై ఆసక్తి.. ఊహించని మలుపులు తిరిగిన జీవితం.. లింగ మార్పిడి,మూడేళ్లుగా గ్యాంగ్ రేప్...
- Sports
పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీనే అత్యుత్తమం.. జడేజా కూడా: శ్రీలంక పేసర్
- Finance
4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇటు ఎన్టీఆర్.. అటు రామ్ చరణ్.. నిజంగానే సరిలేరు నీకెవ్వరు రష్మిక మందన్న!
యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ట్రెండ్ నడుస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఆమెకు, ఆమె అందానికి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కుతున్నాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం ఆమె ఇటు ఎన్టీఆర్, అటు రామ్ చరణ్ ఇద్దరితో రొమాన్స్ చేసే అవకాశం పట్టేసిందని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

మహేష్ బాబుతో బిజీ.. ఇద్దరూ కలిసి
ప్రస్తుతం మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది రష్మిక మందన్న. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఇద్దరూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ హింట్ ఇచ్చింది ఈ కన్నడ బ్యూటీ.

రెండు భారీ ఆఫర్లు.. ఎన్టీఆర్, రామ్ చరణ్
సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ లో పాల్గొంటూ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని రష్మిక వెల్లడించింది. దీంతో రష్మిక చెప్పిన ఈ రెండు ప్రాజెక్టులు ఎన్టీఆర్, రామ్ చరణ్‌వే ఆమె టాక్ ముదిరింది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు RRR సినిమా పూర్తికాగానే వేరు వేరుగా రష్మికతో తమ తమ సినిమా చేయబోతున్నారని చెప్పుకుంటున్నారు.

రష్మిక మందన్న హింట్.. జనం టాక్
RRR తర్వాత రామ్‌చరణ్ చేయబోయే సినిమాలో రష్మిక ఛాన్స్ దక్కించుకుందని, అలాగే ఎన్టీయార్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా కోసం కూడా రష్మిక పేరునే పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తోంది. అందుకే ఇలా రష్మిక రెండు భారీ ప్రాజెక్టులు అంటూ చిన్న హింట్ ఇచ్చిందని అంటున్నారు జనం.

అల్లు అర్జున్, నితిన్
ఇకపోతే సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో రష్మికనే హీరోయిన్‌గా తీసుకున్నారు. అతిత్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అదేవిధంగా నితిన్ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా తెరకెక్కుతున్న `భీష్మ` మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతోంది.

రష్మిక మందన్న.. సరిలేరు నీకెవ్వరు
ఫైనల్‌గా ఆమె తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' గురించి చెప్పుకుంటే.. ఈ సినిమాలో రష్మిక రోల్ కీలకంగా ఉంటూ కడుపుబ్బా నవ్విస్తుందని ట్రైలర్ ద్వారా తెలిసిపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.