హీరోయిన్‌తో విజయ్ దేవరకొండ పెళ్లి.. షడన్ షాకిచ్చిన రష్మిక మందన్నా
తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ యంగ్ హీరోకూ సాధ్యం కాని రీతిలో కెరీర్‌ను మొదలుపెట్టిన కొంత సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. ఆరంభంలోనే హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటిన అతడు.. క్రమంగా మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు. కానీ, ఆ తర్వాత మాత్రం వరుసగా ఫెయిల్యూర్లను చూస్తూనే ఉన్నాడు.
చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న విజయ్ దేవరకొండ.. ఈ సారి కచ్చితంగా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతోనే ఉన్నాడు. ఇందులో భాగంగానే అతడు ఇప్పుడు తన 13వ చిత్రం 'ఫ్యామిలీ స్టార్'ను పరశురాం దర్శకత్వంలో చేస్తున్నాడు. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్‌లో రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తి అయింది. వాస్తవానికి ఈ మూవీని సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసింది. కానీ, సమ్మర్‌కు వాయిదా వేసినట్లు తెలిసింది.
విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'ఫ్యామిలీ స్టార్' మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా నటిస్తున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఇందులో ఆమె ఎవరూ ఊహించని పాత్రలో కనిపిస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ చిత్రంలో రష్మిక రోల్ గురించి ఎన్నో రకాల వార్తలు వెలుగులోకి వచ్చి వైరల్‌గా మారుతూనే ఉన్నాయి.
'ఫ్యామిలీ స్టార్' మూవీలో అసలు రష్మిక మందన్నా ఎంత సేపు కనిపించబోతుంది అన్న దానిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో ఆమె ఓ పాటలో మాత్రమే కనిపిస్తుందట. అది విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ మ్యారేజ్ సాంగ్ అని తెలిసింది. వాళ్ల పెళ్లి సందర్భంగా గెస్టుగా వచ్చినట్లు రష్మికను చూపించబోతున్నారని సమాచారం.

విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీలో రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చే సన్నివేశం పాటలోదే అయినా చాలా స్పెషల్‌గా డిజైన్ చేసినట్లు తెలిసింది. ఇది నిజంగా వీళ్లిద్దరి అభిమానులను సర్‌ప్రైజ్ చేసే విధంగానే ఉంటుందని అంటున్నారు. దీంతో 'ఫ్యామిలీ స్టార్'లో రష్మిక ఎంట్రీపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది.
ఇక, విజయ్ దేవరకొండ - పరశురాం పెట్ల కలిసి చేస్తున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











