షాకవుతున్న నిర్మాతలు: రష్మిక రెమ్యూనరేషన్ ఎంత పెంచిందో తెలుసా?
హీరోయిన్ రష్మిక మందన్న సూపర్ థ్రిల్లింగ్ మూడ్లో ఉన్నారు. ఆమె నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రం ఒకేసారి నాలుగు సౌతిండియన్ లాంగ్వేజ్‌లో విడుదల అవుతుండటమే ఇందుకు కారణం. తొలిసారిగా తన మూవీ ఇంత పెద్దగా రిలీజ్ అవుతుండటంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కాగా... రష్మిక మందన్న తన రెమ్యూనరేషన్ పెంచినట్లు ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. జులై 12న సినిమా ప్రమోషన్లో భాగంగా బెంగుళూరు వచ్చిన రష్మికను కొందరు కన్నడ నిర్మాతలు కలిశారని, అయితే ఆమె రెమ్యూనరేషన్ పెంచి చెప్పడంతో కంగుతిన్నట్లు తెలుస్తోంది.

వరుస విజయాలతో పాటు తెలుగులో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో చిత్రంలో అవకాశం రావడంతో.... రష్మిక తన రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. ఇంతకు ముందు ఆమె ఒక్కో సినిమాకు రూ. 40 లక్షల వరకు చార్జ్ చేసేది. అయితే ప్రస్తుతం సినిమాను బట్టి రూ. 60 లక్షల నుంచి రూ. 80 లక్షలు డిమాండ్ చేస్తోందట. త్వరలో రాబోతున్న కన్నడ చిత్రం 'పొగరు' కోసం రూ. 64 లక్షలు చార్జ్ చేసినట్లు సమాచారం.
రష్మిక సినిమాల విషయానికొస్తే... 'డియర్ కామ్రెడ్' జులై 26న విడుదల కాబోతోంది. దీంతో పాటు కన్నడలో 'పొగరు, తెలుగులో నితిన్‌తో కలిసి 'భీష్మ', మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్-సుకుమార్ మూవీలో, తమిళంలో కార్తితో కలిసి మరో చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











