రష్మిక డెడికేషన్ వేరే లెవెల్..రోజుకు 8 గంటల కఠిన శిక్షణ

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఫుల్ జోష్ మీదున్న హీరోయిన్ రష్మిక. తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవలే 'ది గర్ల్ ఫ్రెండ్' తో థియేటర్లలో సందడి చేసిన ఈ అమ్మడు.. మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులతో ముందుకు రానున్నది. అయితే, ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తుందట. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటుందట. ఇంతకీ ఆ సినిమా ఏంటీ? ప్రత్యేక శిక్షణ ఏంటీ?

పాన్ ఇండియా స్టార్‌గా రష్మిక తన కెరీర్‌లో దూసుకెళ్తుంది.ఇప్పటివరకు రొమాంటిక్, ఫ్యామిలీ, కమర్షియల్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన యాక్షన్ అవతారంలో కనిపించడానికి సిద్ధమవుతోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న మైసా (Mysaa) అనే లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా మూవీ నటిస్తుంది. అయితే, ఈ సినిమా కోసం రష్మిక శారీరక, మానసికంగా సిద్దమవుతోంది. సవాళ్లతో కూడిన కఠిన శిక్షణలో పాల్గొంటోంది.

Rashmika Mandanna Intense martial arts Training for Mysaa Action Role Stuns Fans

ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ఆసక్తికర అంశం ఏమిటంటే.. రష్మిక తన పాత్రలో ఎంత సీరియస్‌గా ఉండబోతుందట. ఆ పాత్రకు న్యాయం చేకూరేలా ట్రాన్స్ఫామ్ అవుతుందట. బ్యాంకాక్‌లో ఆమె ప్రతిరోజూ దాదాపు 8 గంటల పాటు మార్షల్ ఆర్ట్స్, స్టంట్ టెక్నిక్స్, హ్యాండ్-టు-హ్యాండ్ కాంబాట్‌లో శిక్షణ పొందుతోందట. అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ నేతృత్వంలో, అలాగే ప్రఖ్యాత జైకా స్టంట్ టీమ్‌తో కలిసి ఆమె ఈ శిక్షణ తీసుకుంటోందట. 'కమాండో', 'కుంగ్ ఫూ వారియర్', 'కల్కి' వంటి సినిమాలకు పనిచేసిన ఆండి లాంగ్ ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్ కానున్నారట.

సాధారణంగా హీరోయిన్లు యాక్షన్ సీన్ల కోసం డూప్‌లను ఉపయోగించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, రష్మిక మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. 'డూప్ లేకుండా నేనే ఫైట్స్ చేస్తాను' అనే నిర్ణయం తీసుకుని, తన శరీరాన్ని పూర్తిగా ఆ పాత్రకు తగ్గట్టు మార్చుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు కూడా అయ్యాయని, అయినా వెనక్కి తగ్గకుండా మరింత కట్టుదిట్టంగా శిక్షణ కొనసాగిస్తున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.

'మైసా' మొదటి గ్లింప్స్‌లోనే రష్మిక ఒక గోండ్ తెగకు చెందిన మహిళగా, ఇప్పటివరకు చూడని విధంగా ఉగ్రరూపంలో కనిపించింది. అందులో ముఖంపై గాయాలు, రక్తంతో కూడిన ఆ లుక్.. ఆమె పాత్ర ఎంత తీవ్రంగా ఉండబోతోందో స్పష్టం చేస్తోంది. దర్శకుడు రవీంద్ర పుల్లె కూడా ఆమె పాత్రను 'గాయాలతో రాసుకున్న యుద్ధం... ఆమెయే ఆయుధం' అంటూ ట్యాగ్ ఇవ్వడం ఈ సినిమాను హైలెట్. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం బ్యాంకాక్ లో ట్రైనింగ్ తీసుకుంటుంది.

ఈ ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే, మూవీ యూనిట్ తదుపరి షెడ్యూల్ కోసం కేరళకు వెళ్లనుంది. అక్కడ సుమారు 16 రోజుల పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేరళలోని అటవీ ప్రాంతాలు, ప్రకృతి అందాలు ఈ యాక్షన్ సన్నివేశాలకు రియలిస్టిక్ ఫీలింగ్‌ను తీసుకురానున్నాయి. ఈ షెడ్యూల్ సినిమా మొత్తానికి హైలైట్ అవుతుందని యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని శ్రేయాస్ పి కృష్ణ నిర్వహిస్తుండగా, మ్యూజిక్‌ను జేక్స్ బీజోయ్ అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే పుష్ప, యానిమల్ వంటి భారీ విజయాలతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన రష్మిక, 'మైసా' ద్వారా తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X