1000 కోట్ల బడ్జెట్ మూవీలో రష్మిక.. నేషనల్ క్రష్ పై కన్నేసిన సూపర్ స్టార్

Rashmika: రష్మిక మందాన.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ కన్నడ భామ టాలీవుడ్ లో వరుస విషయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ' పుష్ప ' సినిమాతో ఈ అమ్మడు నేషనల్ క్రష్ గా మారింది. ఈ సినిమాతో రష్మిక వర్డల్ వైడ్ ఫ్యాన్స్ సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి దుమ్మురేపుతోంది. తాజాగా సూపర్ స్టార్స్ తెరకెక్కబోతున్న సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిందట.

ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal)'చావా'(Chaava) సినిమాలో హీరోయిన్ నటిస్తోంది. ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించారు. ఈ మూవీని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్ నిర్మిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్‌ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా పాల్గొంటుంది.

Rashmika Mandanna is set to star in a movie with Rajinikanth and Salman Khan directed by Atlee

రష్మిక.. చేతులో 'సికిందర్'అనే బాలీవుడ్ మూవీ కూడా ఉంది. ఈ సినిమాకు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూట్ త్వరలో పూర్తి కాబోతుంది. మార్చిలో విడుదల కానుంది. ఇలా భారీ బడ్జెట్, మల్టీ స్టారర్ మూవీలో రష్మికకు బాలీవుడ్ లో మరో భారీ అవకాశం లభించింది. మరో భారీ బడ్జెట్ అండ్ మల్టీస్టారర్ మూవీలో నటించే లక్కీ చాన్సును నేషనల్ క్రష్ కొట్టేసిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటో కాదు..

ది గ్రేట్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న మూవీలో రష్మిక ను కథానాయకగా తీసుకోవాలని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా మరో హీరోగా నటిస్తున్నారు. ఇలా సౌత్ నార్త్ సూపర్ స్టార్స్ నటిస్తున్న ఈ మూవీ కోసం దాదాపు 100 కోట్ల బడ్జెట్ వెచ్చించబోతున్నారట. అయితే ఈ సినిమాలో రష్మిక మందాన ను హీరోయిన్ గా తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ జంటగా రష్మికను సెట్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Rashmika Mandanna is set to star in a movie with Rajinikanth and Salman Khan directed by Atlee

ఇక సల్మాన్ ఖాన్ వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'సికందర్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను ఏడాది ఈద్ కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం 'కూలీ', 'జైలర్ 2' సినిమా షూటింగ్స్ ల్లో బిజీగా ఉన్నారు. మొత్తానికి ఈ ఏడాది చివరి నాటికి ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X