అల్లు అర్జున్‌తో మళ్లీ రష్మిక..‘పుష్ప'ను మించేలా అట్లీ మాస్టర్ ప్లాన్ .. నేషనల్ క్రష్ షాకింగ్ రోల్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. పుష్ప 2 తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ఈ కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాత్కాలికంగా AA22 గా పిలుస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతోంది. దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తైనట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తోందని అధికారికంగా ప్రకటించారు. తాజాగా మరో ఆసక్తికరమైన అప్‌డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఏమిటంటే..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna).. ఈ అమ్మడు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారట. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక కు ఉన్న ఫాలోయింగ్ ఏంటో తెలుసు. అల్లు అర్జున్- రష్మిక జోడీకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, అట్లీ ఈ కాంబోను మరోసారి తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేశారట. అంతే కాదు.. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్‌లో ఆమె సోలో సీన్లు షూట్ చేసినట్లు టాక్‌. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Rashmika Mandanna Joins Allu Arjun Atlee Movie AA22 National Crush in Powerful Negative Role After Pushpa 2

అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఈ సినిమాలో రష్మిక రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్‌గా కాకుండా, ప్రతినాయిక పాత్రలో కనిపించనుందట. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా ఆమె పాల్గొననున్నారని, ఇందుకోసం ప్రత్యేకంగా యాక్షన్ ట్రైనింగ్ తీసుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఎక్కువగా పాజిటివ్, సాఫ్ట్ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు ఇది పూర్తిగా కొత్త ప్రయోగం కావడంతో, ఆమె కెరీర్‌లో ఇది కీలక మలుపుగా మారుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించిన రష్మిక.. ఇప్పుడు AA22తో మరో స్థాయికి వెళ్లే ఛాన్స్ దక్కించుకున్నట్టేనని అభిమానులు అంటున్నారు. అల్లు అర్జున్‌తో ఆమె కెమిస్ట్రీ ఇప్పటికే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన నేపథ్యంలో, ఈసారి నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో ఎలా మెప్పిస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ 2027లో విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామాకు అల్లు అర్జున్ స్టైల్ జతకలిస్తే బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ మెగా ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్ఛర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలకు చోటు ఉందట. అందులో దీపికాతో పాటు మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక నటించబోతున్నారట. వీరితో పాటు సీనియర్ నటి రమ్యకృష్ణ, కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, కమెడియన్ యోగి బాబుకీలక పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ స్టార్ కాస్టింగ్ చూసి ట్రేడ్ వర్గాలు ఇప్పటికే 'వెయ్యి కోట్ల క్లబ్ ఖాయం'అంటూ అంచనాలు వేస్తున్నాయి. విడుదలకు ముందే ఓటీటీ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కేవలం పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాను తీసుకెళ్లాలన్నదే అట్లీ ప్లాన్‌గా తెలుస్తోంది.మాస్ ఎలిమెంట్స్‌ను సైన్స్ ఫిక్షన్ టచ్‌తో ప్రెజెంట్ చేయడంలో అట్లీకి ప్రత్యేకమైన స్టైల్ ఉంది. దానికి అల్లు అర్జున్ ఎనర్జీ, స్టైల్ కలిస్తే థియేటర్లలో రచ్చ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు, రష్మిక అరుదైన నెగటివ్ రోల్‌లో కనిపిస్తే అది ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారనుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X