గందరగోళంలో రష్మిక.. బ్రేకప్‌తో రచ్చ.. ముఖం చాటేస్తున్న కన్నడ బ్యూటీ

తెలుగులో ఛలో, గీతా గోవిందం, దేవదాస్ చిత్రాల తర్వాత కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కెరీర్‌ మాంచి జోరు మీద ఉంది. కెరీర్ రాకెట్ వేగంతో దూసుకెళ్తుండగా.. వ్యక్తిగత జీవితం కొంత ఆటుపోట్లకు గురైన విషయం తెలిసిందే. కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకోవడం దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుతం కన్నడ కంటే తెలుగులో బిజీగా మారిన ఈ అందాల తార విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అదేమిటంటే..

రక్షిత్‌తో బ్రేకప్‌తో రచ్చ

రక్షిత్‌తో బ్రేకప్‌తో రచ్చ

ఛలో సినిమా తర్వాత రష్మిక కెరీర్ ఓ టర్న్ తీసుకొన్నది. దర్శక, నిర్మాతల నుంచి భారీ ఆఫర్లు తలుపుతట్టాయి. దాంతో పర్సనల్ లైఫ్ కంటే ప్రొఫెషనల్ లైఫ్ ముఖ్యమని భావించింది. దాంతో ప్రేమ, పెళ్లికి పుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకొన్నది. కెరీర్‌కే ప్రాధాన్యం ఇవ్వడం రక్షిత్ శెట్టి కుటుంబ సభ్యులకు నచ్చలేదట. ఆ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది.

టాలీవుడ్‌లో బిజీ బిజీగా

టాలీవుడ్‌లో బిజీ బిజీగా

గీత గోవిందం, దేవదాస్ బ్లాక్ బస్టర్లుగా మారడంతో రష్మికకు టాలీవుడ్‌లో కుప్పలుతెప్పలుగా అవకాశాలు వస్తున్నాయి. దాంతో తెలుగు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్‌ను గాడిలో పెట్టుకొంటున్నది. అయితే కన్నడలో మాత్రం ఒకటో అరా చిత్రాలు చేస్తూ ఆ పరిశ్రమకు దూరంగా ఉంటున్నది.

కన్నడ వాసులు గుర్రుగా

కన్నడ వాసులు గుర్రుగా

రష్మిక వ్యవహారంపై కన్నడ వాసులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. కన్నడ పరిశ్రమకు దూరంగా ఉండటంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే కాకుండా, సొంత రాష్ట్రానికి వెళ్లడానికి ముఖం చాటేస్తుందట. ప్రస్తుత పరిస్థితుల్లో బెంగళూరుకు దూరంగా ఉండటమే మేలని భావిస్తున్నదట.

త్రివిక్రమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్

త్రివిక్రమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్

దేవదాస్ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి డియర్ కామ్రేడ్‌లో, నితిన్ భీష్మలోనూ రష్మిక నటిస్తున్నది. అరవింద సమేత చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా, శర్వానంద్ సరసన ఓ మూవీని రష్మిక చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. అయితే ఇంకా ఇవి చర్చల దశలోనే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X