రష్మిక మందన్న బోల్డ్ డిసీషన్.. ఏకంగా అలాంటి పాత్రలో శ్రీవల్లి!
నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే తను నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కమర్షియల్ సక్సెస్ ను అందుకుంటున్నాయి. దాంతో రష్మిక మందన్న మున్ముందు చేయబోయే చిత్రాల గురించి ప్రేక్షకులతో పాటు సినీ నిపుణులకు కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ క్రమంలో రష్మిక మందన్న కెరీయర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తన రాబోయే చిత్రంలో అలాంటి పాత్రలో నటించేందుకు సిద్ధమైందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
వరుస హిట్స్ తో రష్మిక సెన్సేషన్..
రష్మిక మందన్న అల్లు అర్జున్ తో నటించిన పుష్ప చిత్రం తర్వాత నేషనల్ క్రష్ గా మారిపోయింది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప : ది రైజ్ చిత్రంలో శ్రీవల్లి పాత్రను పోషించి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం తర్వాత యానిమల్, చావా, సికిందర్, కుబేరా వంటి చిత్రాలతో వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుంది. ఇలా వరుస హిట్స్ తో బాక్సాఫీస్ వద్ద రూ.4000 కోట్ల వరకు వసూళ్లు సాధించిన హీరోయిన్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆమె రాబోయే చిత్రాలపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.

మరోసారి అల్లు అర్జున్ తో కలిసి..
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన రెండు చిత్రాల్లో నటించింది. శ్రీవల్లి పాత్రలో పుష్ప : ది రైజ్, పుష్ప : ది రూల్ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ఈ రెండూ చిత్రాలు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. కాగా ఈ రెండు చిత్రాల తర్వాత మరోసారి అల్లు అర్జున్ తో కలిసి నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ నెలకొంది.
కెరీయర్ లోనే ఫస్ట్ టైమ్ అలాంటి పాత్రలో..
తన కెరీయర్ లో ఇప్పటి వరకు రష్మిక మందన్న హీరోయిన్ గా నటించడమే కాకుండా కొన్ని విభిన్న పాత్రల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం గ్లామర్ పాత్రలకే కాకుండా పవర్ రోల్స్ లో నటిచేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలోనే AA22xA6 ప్రాజెక్ట్ లో నెగెటివ్ రోల్ లో నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ చర్చగా మారింది. దీనిపై అధికారిక ప్రకటన లేదు.
AA22xA6 ప్రాజెక్ట్ వివరాలు..
అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ బ్యానర్ లో కోలీవుడ్ అగ్ర నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. 800 కోట్ల బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. మరోవైపు చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తోంది. మృణాల్ ఠాకూర్ కూడా ఫైనల్ అయ్యింది. మరో ముగ్గురు హీరోయిన్లలో రష్మిక మందన్న కూడా ఉందని బజ్ క్రియేట్ అయ్యింది.


Click it and Unblock the Notifications











