డైరెక్టర్ సెంటిమెంట్‌.. చైతు పక్కన రష్మిక?

గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు పరుశురామ్. సోలో చిత్రం నుంచి ఆయన తన శైలిని నమ్ముకునే కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ప్రేమ కథలను తెరకెక్కించినా వాటిని కుటుంబ నేపథ్యంలోనే ఉండేట్టు చూసుకోవడం ఈ దర్శకుడి స్టైల్. అందులో భాగంగా విజయ్, రష్మికతో చేసిన గీతగోవిందం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

అయితే గీతగోవిందం విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా మరో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు. ఆయన రెడీ చేసుకున్న కథను అటూ ఇటూ తిప్పి చివరకు నాగ చైతన్యను ఒప్పించాడు. ప్రస్తుతం నాగ చైతన్య కూడా బిజీగా ఉన్నా.. పరుశురామ్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయినట్టు టాక్. అందుకే ఆయనకు ఓకే చెప్పాడని సమాచారం.

 Rashmika Mandanna May Act In Parasuram And Naga Chaitanya Movie

ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'నాగేశ్వ‌ర‌రావు' అనే పేరు పెట్టిన‌ట్టు టాక్. ఈ మూవీలో చైతన్య పక్కన హీరోయిన్ ఎవరా? అన్న వార్త హల్ చల్ చేస్తోంది. గీత గోవిందం సెంటిమెంట్‌తో ఈ సినిమాలోనూ ర‌ష్మిక‌నే తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నట్టు టాక్.

మ‌రోవైపు కీర్తి సురేష్ పేరు కూడా బ‌లంగా వినిపిస్తోంది. గీతగోవిందం మాదిరిగానే హీరోయిన్‌కు పాత్రకు ఎక్కువ స్కోప్ ఉందని, అందుకే కీర్తి సురేష్, రష్మికను ఆప్షన్స్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సెంటిమెంట్ దృష్ట్యా చైతు పక్కనే రష్మికనే ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X