సౌత్ నెంబర్ వన్ హీరోతో రష్మిక మందన్న.. హిట్టు పడితే తిరుగే ఉండదు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ గత ఏడాది వరకు గట్టిగానే కొనసాగింది. కానీ సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు డీలా పడటంతో రేస్ లోకి పూజా హెగ్డే - రష్మిక మందన్న వచ్చేశారు. ఇద్దరు కూడా పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ పోటీలో మొన్నటివరకు పూజా హెగ్డే వరుస విజయాలతో లీడ్ లో ఉండగా ఇప్పుడు మెల్లగా మొదటి స్థానానికి రష్మిక వెళుతోంది.
ఆమె చేతిలో ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్పతో పాటు మరో రెండు మంచి సినిమాలు కూడా ఉన్నాయి. ఇక త్వరలో సౌత్ నెంబర్ వన్ హీరోతో కూడా వర్క్ చేయబోతోంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో 100కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ ని ఎక్కువ సార్లు అందుకున్న కోలీవుడ్ హీరో విజయ్. ఈ హీరోతో ఛాన్స్ కోసం చాలా మంది ఎదురుచూస్తుండగా అదృష్టం రష్మికను వరించింది.

ప్రస్తుతం ఆమె షెడ్యూల్స్ లో తెలుగు సినిమాలతో పాటు కన్నడ మలయాళం సినిమాలు కూడా ఉన్నాయి. ఇక తమిళ్ సినిమా నుంచి మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో విజయ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. మురగదాస్ దర్శకత్వంలో విజయ్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలోనే రష్మిక హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











