క్రేజీ అప్‌డేట్: అన్నంతపనీ చేస్తున్న రష్మిక.. అంతా రెడీ! ఇక అదే తరువాయి.

'ఛలో' అంటూ తెలుగు తెరపై కాలుమోపిన రష్మిక మందన్న.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ క్రెడిట్ కొట్టేసింది. క్రేజీ హీరోయిన్‌గా స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే ఛాన్సులు పట్టేస్తోంది. దీనికి తోడు ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలోనే మరో అడుగు వేసేందుకు సిద్దమవుతుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఏంటి అసలు మ్యాటర్ అంటారా? ఈ వివరాలు చూడండి మీకే తెలుస్తుంది.

వరుస హిట్స్.. రష్మికపై దర్శకనిర్మాతల చూపు

వరుస హిట్స్.. రష్మికపై దర్శకనిర్మాతల చూపు

''గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ'' లాంటి సినిమాలతో భారీ హిట్స్ ఖాతాలో వేసుకుంది రష్మిక మందన్న. అందానికి తగ్గ అభినయం ఆమె సొంతం కావడంతో కెరీర్ ఆరంభించిన కొద్ది కాలంలోనే ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడింది.

అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇద్దరితో రష్మిక

అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇద్దరితో రష్మిక

దీంతో రష్మిక మందన్నకు వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈమెను చిరంజీవి 152వ సినిమాలోనూ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ జోడీగా ఆమెకు కన్ఫర్మ్ చేసినట్లు టాక్.

కన్నడ బ్యూటీ ఆలోచన.. వెంటనే ప్రకటన

కన్నడ బ్యూటీ ఆలోచన.. వెంటనే ప్రకటన

చిత్రసీమలో హీరోయి‌న్‌గా రాణిస్తూనే మరో ఆలోచన చేసింది ఈ కన్నడ బ్యూటీ. నిర్మాతగా మారడానికి ఆసక్తి చూపుతోంది రష్మిక. ఈ మేరకు మీ వద్ద మంచి స్క్రిప్టులు ఉంటే తనను సంప్రదించాలంటూ ఇటీవలే ఆమె ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఆ దిశగా రష్మిక అడుగులు..

ఆ దిశగా రష్మిక అడుగులు..

అయితే రష్మిక ఇచ్చిన ఈ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చిందని తెలుస్తోంది. పలువురు యువ దర్శకులు తమ స్క్రిప్టులను రష్మికకు పంపించారట. రష్మిక, ఆమె టీమ్ ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో నుంచి ఓ స్క్రిప్ట్ ఫైనల్ చేసి త్వరలోనే రష్మిక తన సొంత బ్యానర్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోందట.

Recommended Video

Sarileru Neekevvaru @50 Days | Mahesh Babu Emotional Tweet
అంతా రెడీ! ఇక అదే తరువాయి..

అంతా రెడీ! ఇక అదే తరువాయి..

కెరీర్ ఆరంభంలోనే ఇలా నిర్మాణ రంగంలోకి రావడం ఎందుకు? రష్మిక ఇలాంటి స్టెప్ ఇంకా బోలెడు సమయం ఉందిగా! అని నెటిజన్స్ తమ అభిప్రాయం చెప్పినప్పటికీ.. రష్మిక మాత్రం అస్సలు తగ్గేదే లేదని అంటోందట. నిర్మాతగా మారడానికి రెడీ అయిపోయిందట. స్క్రిప్ట్ ఫైనల్ కాగానే వెంటనే సినిమా ప్రారంభిస్తుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X