సాయి పల్లవిపై కుళ్ళుతోనే నాని సినిమా రిజెక్ట్.. అంత కోపమెందుకు రష్మిక..?

మీడియాలో వచ్చే కొన్ని రూమర్స్ పూర్తిగా అబద్దాలని అనుకుంటే పొరపాటే అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో నెపోటీజమ్ ఉందని రూమర్స్ వచ్చినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల కొన్ని ఘటనలతోనే అది బయటపడింది. ఇండస్ట్రీలో అసూయ, కుళ్లు ఉండవని అందరం కలిసే ఉంటాం.. అనే మాటలు అబద్దాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల క్లియర్ గా చెప్పేశాడు. అయితే ఇప్పుడు రశ్మిక మందన్న ఒక సినిమాను రిజెక్ట్ చేసిన విధానం అదే తరహాలో కొత్త అనుమానాలను కలిగిస్తోంది.

 సాయి పల్లవి కాంట్రవర్సీ..

సాయి పల్లవి కాంట్రవర్సీ..

సాయి పల్లవి ఈ మధ్య అనుకోని విధంగా కొన్ని కాంట్రవర్సీ వార్తల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఆ మధ్య రెమ్యునరేషన్ పెంచిందని అలాగే గోపిచంద్ సినిమాను కూడా కావాలనే రిజెక్ట్ చేసిందనే కామెంట్స్ వచ్చాయి. అయితే రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ బ్యూటీ పెద్దగా అలాంటి విషయాలను పట్టించుకోలేదు.

 సాయి పల్లవి ఉందని..

సాయి పల్లవి ఉందని..

ఇక ఇటీవల రష్మీక మందన్న మాత్రం సాయి పల్లవితో నటించడం ఇష్టం లేకనే బంగారం లాంటి అవకాశం మిస్ చేసుకుందట. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గాని గతంలో కూడా సాయి పల్లవి నటిస్తోందని తమిళ్ లో సూర్య NGKలో ఛాన్స్ రాగా ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట.

మాట మార్చిన రష్మిక..

మాట మార్చిన రష్మిక..

అది ఎంతవరకు నిజమనే విషయం పక్కన పెడితే ఈ సారి మాత్రం నాని సినిమాలో మొదట నటిస్తానని చెప్పిన రష్మిక మందన్న కొన్నిరోజులకే చేయలేనని తప్పుకుందట. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని శ్యామ్ సింగరాయ్ అనే పిరియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో రష్మిక మందన్నతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ ని ఫిక్స్ చేయాలని అనుకున్నారు.

డామినెట్ చేసిందా?

డామినెట్ చేసిందా?

రష్మికను ఫిక్స్ చేసిన తరువాత సాయి పల్లవిని కూడా ఫైనల్ చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే రష్మిక ఆ ప్రాజెక్ట్ నేను చేయలేనని చెప్పిందట. సినిమాలో సాయి పల్లవి రోల్ డామినేట్ చేసే అవకాశం ఉందని సినిమా నుంచి సైలెంట్ గా తప్పుకుందట. దీంతో ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X