అచ్చం సమంత లాగే రష్మిక మందన్న.. సుక్కు భలే ప్లాన్ చేశాడే!

డైరెక్టర్ సుకుమార్ చేసిన ఓ పెర్ఫెక్ట్ ప్లాన్ చేశాడట. రంగస్థలం సినిమా తర్వాత ఆయన చేయబోతున్న తదుపరి సినిమా కోసం క్రియేటివ్ స్కెచ్ వేశాడట. సుకుమార్, అల్లు అర్జున్ క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న హ్యాట్రిక్ మూవీలో రష్మిక కోసం స్పెషల్ గా క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారట సుకుమార్. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఏ నోట విన్నా ఇదే న్యూస్ వినిపిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దామా..

రంగస్థలంతో భారీ బ్లాక్ బస్టర్

రంగస్థలంతో భారీ బ్లాక్ బస్టర్

ఇటీవలే రంగస్థలం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు సుకుమార్. రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించి కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఇంతటి భారీ సినిమా తర్వాత తన తదుపరి ప్రాజెక్టును స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయాలని ఫిక్స్ అయ్యారు సుకుమార్.

 రష్మిక మందన్న పై సుకుమార్ కన్ను

రష్మిక మందన్న పై సుకుమార్ కన్ను

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ శరవేగంగా పూర్తి చేస్తున్నారట సుకుమార్. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే.. ఈ చిత్రంలో రష్మిక మందన్నను హీరోయిన్‌గా ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఛలో అంటూ టాలీవుడ్ గొప్ప తొక్కిన ఈ భామ ప్రెసెంట్ క్రీజీ హీరోయిన్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. ఈ మేరకు సుకుమార్ కన్ను రష్మిక మందన్న పై పడిందని తెలుస్తోంది.

రష్మిక క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా

రష్మిక క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా

అందుకే ఈ చిత్రంలో రష్మిక క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా సుక్కు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. 'రంగస్థలం' లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. అందుకే ఈ చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట సుకుమార్.

పల్లెటూరి నేపథ్యంలోనే..

పల్లెటూరి నేపథ్యంలోనే..

ఈ సినిమాను కూడా రంగస్థలం లాగే పల్లెటూరి నేపథ్యంలోనే రూపొందించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు రంగస్థలంలో రామలక్ష్మిగా సమంత ఎలాగైతే అలరించిందో అంతకు మించి రష్మిక అలరించేలా సుక్కు స్కెచ్ వస్తున్నారట. ఈ లెక్కన ఇవన్నీ చూస్తుంటే రష్మికకు ఇది బంపర్ ఆఫర్ అని అనిపిస్తోంది కదూ!. చూదాం మరి.. ఇంతకీ రష్మిక ఈ ప్రాజెక్ట్ చేస్తుందా? లేదా? అనేది.

రష్మిక మందన్న డిమాండ్

రష్మిక మందన్న డిమాండ్

ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో, అలాగే నితిన్ సరసన భీష్మ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమెకున్న డిమాండ్ దృష్ట్యా వరుస అవకాశాలు తలుపు తడుతున్నట్లుగా సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X