క్రేజీ కాంబినేషన్.. మెగా హీరోతో గబ్బర్ సింగ్ డైరెక్టర్, గీత గోవిందం హీరోయిన్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం అంతరిక్షం. సంకల్ప్ రెడ్డి దర్శకతంలో విడుదలవుతున్న ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. మరో వైపు వరుణ్ అనిల్ రావిపూడి దర్శత్వంలో ఎఫ్2 చిత్రంలో నటిస్తున్నాడు. ఫిదా, తొలి ప్రేమ లాంటి సూపర్ హిట్స్ తరువాత వరుణ్ తేజ్ జోరు పెంచాడు. తాజగా వరుణ్ తేజ్ మరో చిత్రానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ తదుపరి చిత్రానికి సంబంధించి క్రేజీ కాంబినేషన్ వినిపిస్తోంది.

తమిళ సూపర్ హిట్ చిత్రం
నాలుగేళ్ళ క్రితం తమిళంలో జిగర్తాండ అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, బాబీ సింహ ప్రధాన పాత్రల్లో నటించారు. అద్భుతమైన పాత్రలతో ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ సిద్ధార్థ్ పాత్రలో నటించనున్నాడని, ఆమేరకు చర్చలు జరుగుతున్నాయని సినీవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

క్రేజీ కాంబినేషన్
ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శత్వం వహించబోతున్నాడట. హీరోయిన్ గా సెన్సేషనల్ బ్యూటీ రష్మిక మందన నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దువ్వాడ జగన్నాథం చిత్రం తరువాత హరీష్ శంకర్ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. హరీష్ ఈ తమిళ రీమేక్ చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్మిక మందన తెలుగులో అద్భుతమైన అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన రష్మిక డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది.

దేవదాస్ నిరాశపరిచినా
గీత గోవిందం తరువాత తెలుగులో రష్మిక నటించిన చిత్రం దేవదాస్. ఈ చిత్రం నిరాశపరిచింది. అయినా రష్మికకు ఉన్న క్రేజ్ తగ్గలేదు. నితిన్ సరసన ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతోంది. మరి కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా రష్మిక పేరు వినిపిస్తోంది. ఛలో, గీత గోవిందం చిత్రాలతో రష్మిక యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

మెగా ఫ్యామిలీకి
హరీష్ శంకర్ మరోమారు మెగా హీరోతో జత కథాబోతున్నాడు. హరీష్ మెగా హీరోలతో తెరకెక్కించిన చిత్రాలన్నీ విజయాలుగా నిలిచాయి. గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే చిత్రాలకు హరీష్ దర్శత్వం వహించాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు రావడంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విశేషాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











