మెగా కాంపౌండ్‌లో రష్మిక మందన్న.. రామ్ చరణ్‌తో రొమాన్స్.. డైరెక్టర్ స్కెచ్!!

యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న రామ్ చరణ్‌తో రొమాన్స్ చేయబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డైరెక్టర్ చొరవతో రష్మిక మెగా హీరోతో చిందులేసేందుకు రెడీ అవుతోందట. మరి ఎవరా మెగా హీరో? రష్మికనే కావాలని కోరిన ఆ డైరెక్టర్ ఎవరు? వివరాలపై ఓ లుక్కేద్దామా..

కొరటాలతో చిరంజీవి.. ఆ కారణంగా వాయిదా

కొరటాలతో చిరంజీవి.. ఆ కారణంగా వాయిదా

'సైరా నరసింహా రెడ్డి' సినిమా తర్వాత తన తదుపరి ప్రాజెక్టును కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ ఫినిష్ అయ్యాక కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

త్రిష అవుట్.. కాజల్ ఇన్

త్రిష అవుట్.. కాజల్ ఇన్

మెగాస్టార్ కెరీర్‌లో 152వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటించనుందని షూటింగ్ ప్రారంభానికి ముందునుంచే విన్నాం. అయితే ఊహించనివిధంగా తాను తప్పుకున్నట్లు త్రిష ప్రకటించడంతో.. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్‌ని సెలక్ట్ చేశారు మేకర్స్.

మహేష్ బాబు కాదు.. రామ్ చరణే!

మహేష్ బాబు కాదు.. రామ్ చరణే!

ఇకపోతే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మరో హీరోకి కూడా ఛాన్స్ ఉందని.. ఆ క్యారెక్టర్ రామ్ చరణ్ వేస్తున్నారని ముందుగా డిసైడ్ అయ్యారంతా. కానీ అనుకోకుండా పిక్చర్ లోకి మహేష్ బాబు ఎంటర్ కావడం, ఆ తర్వాత ఆయన తప్పుకోవడం లాంటి లాంటి వార్తలు షికారు చేశాయి. చివరకు ఆ క్యారెక్టర్ రామ్ చరణే చేయనున్నట్లు కన్ఫర్మ్ అయింది.

రామ్ చరణ్‌తో రొమాన్స్.. రష్మిక ఫిక్స్

రామ్ చరణ్‌తో రొమాన్స్.. రష్మిక ఫిక్స్

ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలకమైన అతిథి పాత్రలో నటించనున్నారు. ఈయనతో నటించేందుకు ఓ హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందట. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌తో రష్మిక రొమాన్స్ చేస్తే ఆ క్రేజ్ ఇంకోలా ఉంటుందని భావించిన డైరెక్టర్ కొరటాల శివ ఆమెనే ఫైనల్ చేశారనేది లేటెస్ట్ సమాచారం. ఈ రోల్ కోసం కియారా, సమంత, పూజా హెగ్డే లాంటి పేర్లు వినిపించినా చివరకు రష్మికను ఫిక్స్ చేశారట.

రెజీనాతో స్పెషల్ సాంగ్.. ఆ రేంజే వేరు!!

రెజీనాతో స్పెషల్ సాంగ్.. ఆ రేంజే వేరు!!

దేవ‌దాయ భూముల ప‌రిర‌క్ష‌ణ నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు టాక్. ఇందులో చిరంజీవి న‌క్స‌లైట్ పాత్ర‌లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇందులో స్పెషల్ ఓ రేంజ్‌లో ఉండనుందని సమాచారం. ఇప్పటికే చిరంజీవి- రెజీనా లతో ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఫినిష్ అయింది.

Recommended Video

Trisha Walks Out Of Chiranjeevi’s ‘Acharya’ Movie
ఉగాది కానుక.. మెగా అభిమానుల్లో ఆతృత

ఉగాది కానుక.. మెగా అభిమానుల్లో ఆతృత

చిరంజీవి- కొరటాల మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై మెగా అభిమానుల్లో ఆత్రుత మొదలైంది. మూవీ అప్‌డేట్స్ కోసం చాలా కుతూహలంగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ చిత్రానికి 'ఆచార్య' అనే టైటిల్ పరిశీలనలో పెట్టిన దర్శకనిర్మాతలు ఉగాది కానుకగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X