అబ్బో..! రష్మిక కోరిక మామూలుగా లేదుగా.. జరిగే పనేనా..?
నటీనటులు తమకు ఫాలోయింగ్ ఉండాలని, స్టార్ స్టేటస్‌తో ఇండస్ట్రీని ఏలాలని భావించడం సహజమే. కానీ అందుకు భిన్నంగా ఆలోచిస్తోంది క్రేజీ భామ రష్మిక మందన్న. ఏకంగా అభిమానులు తన కోసం గుడి కట్టించాలని ఆశ పడుతోందట రష్మిక. ఇది ఎంతవరకు సాధ్యమో ఆమెకే తెలియాలి గానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.
తమ తమ అభిమాన నటీనటులను దేవుడి సమానంగా చూడటం తమిళ ప్రేక్షకులకు అలవాటు. ఈ నేపథ్యంలోనే గుడి కట్టించడం అనేది తమిళనాట కుష్బూతో మొదలైంది. ఆ తర్వాత హన్సిక, నమిత వంటి వారి విషయంలో కూడా తమిళియన్స్ ఇలాగే చేశారు. ఒక్కసారి తమిళ అభిమానులకు ఎవరినైనా నచ్చారంటే వారి అభిమానానికి హద్దులే ఉండవు. అలాంటి అభిమానం నాకు కావాలని ఆరాట పెడుతోందట రష్మిక. ఖుష్భూకి గుడి కట్టినట్లే, అభిమానులు నాకు కూడా గుడి కడితే బాగుండు అని స్నేహితుల వద్ద తన కోరిక వెల్లడిస్తోందట రష్మిక మందన్న.

ఆ నోటా ఈ నోటా పడి బయటకొచ్చిన రష్మిక కోరిక.. చివరకు సోషల్ మీడియా వరకు రావడంతో ఆమె వింత కోరికపై తెగ వార్తలు షికారు చేస్తున్నాయి. అభిమానం ఉండాలని కోరుకోవడం, స్టార్ హీరోయిన్ కావాలని కలలు కనడం వరకూ ఓకే గానీ ఇలా గుడి కట్టించుకోవాలని ఆరాట పడటం అంటే అది ఖచ్చితంగా రష్మిక అత్యాశే అంటున్నారు ప్రేక్షకులు. అసలు అది జరిగే పనేనా..? అయినా ఇలాంటి వింత కోరికలు కోరుకోవడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారు.
ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈమె ప్రస్తుతం మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ జోడీగా వేరు వేరు సినిమాల్లో నటిస్తోంది. తెలుగునాట ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది రష్మిక మందన్న.


Click it and Unblock the Notifications











