twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్మిక మందన్న షాకింగ్ డిసీషన్.. కెరీర్ ఆరంభంలోనే!! ఆశ్చర్యంలో ఫాన్స్..

    |

    సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడెలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది చెప్పడం కష్టమే. అదీ నేటితరం మోడ్రెన్ హీరోహీరోయిన్లు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న తీసుకున్న ఓ నిర్ణయం జనాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఏంటా నిర్ణయం? వివరాల్లోకి పోతే..

     రష్మిక క్రేజీ పర్‌ఫార్‌మెన్స్.. ఫాలోయింగ్

    రష్మిక క్రేజీ పర్‌ఫార్‌మెన్స్.. ఫాలోయింగ్

    'ఛలో' అంటూ తెలుగు తెరపై కాలుమోపిన రష్మిక మందన్న.. ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి సినిమాలతో భారీ హిట్స్ ఖాతాలో వేసుకుంది. అందానికి తగ్గ అభినయం ఆమె సొంతం కావడంతో కెరీర్ ఆరంభించిన కొద్ది కాలంలోనే తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది.

    నితిన్‌తో చిందేసి.. బన్నీతో రొమాన్స్

    నితిన్‌తో చిందేసి.. బన్నీతో రొమాన్స్

    వరుసపెట్టి స్టార్ హీరోలతో ఛాన్సులు పట్టేస్తున్న రష్మిక మందన్న.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హవా నడిపిస్తోంది. ఇటీవలే నితిన్‌తో చిందేసిన ఈ కన్నడ భామ..ప్రెజెంట్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

    అస్సలు వెనకాడేదే లేదు.. ఎంతైనా ఓకే!

    అస్సలు వెనకాడేదే లేదు.. ఎంతైనా ఓకే!

    ఇదిలావుండగానే మరో రెండు సినిమాలు కూడా రష్మిక కోసం వెయిటింగ్ లో ఉన్నాయి. రామ్ చరణ్ తర్వాతి సినిమాలో కూడా రష్మికను తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఆమెకిచ్చే రెమ్మ్యూనరేషన్ విషయంలోనూ వెనుకాడేది లేదని, రష్మిక కోరినంత ఇస్తామని ముందుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో రష్మిక ఓ నిర్ణయం తీసుకోవడం షాకిస్తోంది.

    రష్మిక నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు..

    రష్మిక నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు..

    హీరోయిన్‌గా ఇంత బిజీ కొనసాగుతున్న ఈ సమయంలో నిర్మాతగా మారడానికి ఆసక్తి చూపుతోంది రష్మిక. ఈమె నిర్ణయం స్వాగతించదగినదే అయినా కెరీర్ ఆరంభంలోనే ఇలా ఎందుకు చేయడం? ఇంకా బోలెడు సమయం ఉందిగా! అని చెప్పుకుంటున్నారు జనం. పైగా తెలుగులో హీరోయిన్లు నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ కాబట్టి ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    Recommended Video

    Sarileru Neekevvaru @50 Days | Mahesh Babu Emotional Tweet
    ఛార్మి సక్సెస్.. మరి రష్మిక?

    ఛార్మి సక్సెస్.. మరి రష్మిక?

    కాగా, అచ్చం రష్మిక లాగానే కెరీర్ ఆరంభంలోనే తన అందచందాలతో ఉర్రూతలూగించి భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఛార్మి.. ఆ తర్వాత నిర్మాతగా సక్సెస్ అయింది. మరి రష్మిక మాత్రం అలా ఎందుకు కాదు? నిర్మాతగా కూడా ఆమెకు మంచి లైఫ్ ఉంటుంది అనేవారూ ఉన్నారు. కాకపోతే ఛార్మి ఇలా కెరీర్ ఆరంభంలోనే నిర్మాతగా మారలేదు. రష్మిక మాత్రం అందుకు భిన్నం!.

    English summary
    Rashmika Mandanna is crazy heroine in tollywood. Now Rashmika Mandanna doing her projects rapidly. Also she desided as will produce personally some movies at this stage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X