హాట్ టాపిక్‌గా మారిన రష్మిక మందన టాటూ.. అతడి కోసమే అంటూ, వైరల్!
Recommended Video

హాట్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం టాలీవడ్ లో నయా సంచలనం. రెండు చిత్రాలతో యువత హృదయాల్ని కొల్లగొట్టి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. భారీ చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. ఛలో, గీత గోవిందం చిత్రాలలో రష్మిక తన చలాకి నటనతో ఆడియన్స్ ని ఫిదా చేసింది. గీత గోవిందం చిత్రంలో రష్మిక పెర్ఫామెన్స్ హైలైట్ అయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలు మీడియాలో సంచలనంగా మారాయి. రష్మిక చేతికి ఉన్నా టాటూ గురించి ఆసక్తికర ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

కిర్రాక్ పార్టీ చిత్రంతో
రష్మికకు కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీతో గుర్తింపు లభించింది. ఆ చిత్రంతో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో రశ్మికకు పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడం, వీరిద్దరి వివాహానికి పెద్దలు అంగీకారం తెలపడంతో గత ఏడాది ఈ జంట నిశ్చితార్థం కూడా జరిగింది.

తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా
ఆ తరువాత తెలుగులో రష్మికకు రెండు సూపర్ హిట్ చిత్రాలు పడడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో, గీత గోవిందం చిత్రాలు ఘనవిజయాలుగా నిలిచాయి. గీతగోవిందం చిత్రం అయితే 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

స్టార్ హీరోల సరసన
గీత గోవిందం చిత్రం తరువాత దర్శక నిర్మాతలంతా రష్మిక వైపు చూస్తున్నారు. తాజగా రష్మిక నటించిన మరో చిత్రం దేవదాస్. నాగ్, నాని నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో రష్మిక నానికి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల జరిగింది. ఆడియో వేడుకలో రష్మిక చేతిపై ఉన్న టాటూ చర్చనీయాంశంగా మారింది.

అతడి కోసమేనా
అటు సోషల్ మీడియాలో రష్మిక చేతికి ఉన్న టాటూ చిత్రాలు వైరల్ గా మారుతున్నాయి. చేతిపై ఇర్రిప్లేసబుల్ అని ఇంగ్లీష్ టాటూ ఉంది. భర్తీ చేయలేనిది అని దాని అర్థం.సినీవర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం రక్షిత్ తో ప్రేమలో ఉన్న సమయంలో రష్మిక ఈ టాటూ వేయించుకున్నట్లు చర్చ జరుగుతోంది.

ఎంత ప్రయత్నించినా
ఆడియో వేడుకలో ఎంత ప్రియత్నించినా ఆ టాటూ దగలేదు. కెమెరామెన్లు క్లిక్ మనిపించారు. రష్మిక, రక్షిత్ ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఈ నేపథ్యంలో రష్మిక ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రష్మిక, రక్షిత్ విడిపోవడానికి కారణాలు బయటకు రాలేదు. కానీ అతడిపై ఉన్న ప్రేమకు రష్మిక టాటూనే నిదర్శనం అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











