For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rashmika Mandanna: పాపం! రష్మిక మందన్నా.. ఆ హీరో చేసిన పనికి ఇలా..

  |

  రష్మిక మందన్నా.. యూత్ గుండెలను క్రష్​ చేసి మరి నేషనల్​ క్రష్​గా ఎదిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ సరసన పుష్ప చిత్రంలో నటించి దేశవ్యాప్తంగా శ్రీవల్లిగా పేరు తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడికి తెలుగుతోపాటు కోలీవుడ్​, బాలీవుడ్​లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అంతేకాకుండా పలు అడ్వర్టైజ్​మెంట్​లు కూడా చేసింది. అయితే తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న ఓ సినిమా అర్ధాంత్రంగా ఆగిపోయిందని టాక్ నడుస్తోంది. అందుకు కారణం ఆ మూవీ హీరోనే కారణం అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరిగిందో తెలియాలంటే ఇక్కడ ఓ లుక్కేయాల్సిందే!

   కిరిక్​ పార్టీతో..

  కిరిక్​ పార్టీతో..

  కిరిక్​ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ సినిమా సూపర్​ హిట్​ కావడంతో రష్మికకు కూడా మంచి పేరు వచ్చింది. తర్వాత నాగశౌర్య సరసన ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రష్మిక. ఈ మూవీలోని చూసి చూడంగానే అనే పాట ఎంత పెద్ద హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కూడా రష్మికకు మంచి గుర్తింపునే తెచ్చింది.

   వరుసగా ఆఫర్లు..

  వరుసగా ఆఫర్లు..

  అనంతరం రౌడీ హీరో విజయ్​ దేవరకొండతో కలిసి నటించిన గీత గోవిందం సినిమాతో పాపులర్ హీరోయిన్​గా మారిపోయింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. ఆ వెనువెంటనే దేవదాస్, డియర్​ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు , భీష్మ వంటి చిత్రాల్లో నటించి స్టార్​ హీరోయిన్​గా ఎదిగిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ మరొక ఎత్తు.

  బన్నీతో రష్మిక కెమిస్ట్రీ..

  బన్నీతో రష్మిక కెమిస్ట్రీ..

  ఈ మూవీతో రష్మిక మందన్నాకు ఎలాంటి క్రేజ్​ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో బన్నీ డైలాగ్స్​తోపాటు అల్లు అర్జున్, రష్మికల మధ్య కెమిస్ట్రీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక శ్రీవల్లిగా రష్మిక మందన్నా అభినయానికి, యాక్టింగ్​, డ్యాన్స్​కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఒక్క సినిమాతో రష్మిక మోస్ట్​ బిజియెస్ట్​ హీరోయిన్​గా మారిపోయింది. ఇక ఇవేకాకుండా విజయ్ దేవరకొండతో రష్మిక లవ్​ ట్రాక్ నడిపిస్తోందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి.

  యాక్షన్​ హీరోతో..

  యాక్షన్​ హీరోతో..

  వీరిద్దరు కలిసి చాలా టూర్​లు వెళ్లినట్లుగా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​ అయిన విషయం తెలిసిందే. ఇక ఇదంతా ఇలా ఉంటే పుష్పతో వచ్చిన క్రేజ్​తో రష్మికకు బాలీవుడ్​లో సైతం భారీ ఆఫర్స్ వచ్చాయి. అందులో బాలీవుడ్ యంగ్ యాక్షన్​ హీరో టైగర్ ష్రాఫ్​ సినిమా ఒకటి. ఈ మూవీకి ప్రముఖ దర్శకనిర్మాత కరణ్​ జోహర్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

  పారితోషికం తగ్గించుకోవాలని..

  పారితోషికం తగ్గించుకోవాలని..

  స్క్రూ ఢీలా ఆనే టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ మూవీకి టైగర్ ష్రాఫ్​ రూ. 35 కోట్ల రెమ్యునరేషన్​ తీసుకున్నాడట. ఇందుకోసం అగ్రిమెంట్​ కూడా జరిగిందట. అయితే షూటింగ్​ ప్రారంభం అయ్యాక టైగర్​ను పారితోషికం తగ్గించుకోవాల్సిందిగా కరణ్​ జోహార్​ కోరాడట. ప్రస్తుతం బాలీవుడ్​ ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా రూ. 20 కోట్లు తీసుకు, లాభాల్లో వాటా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడట కరణ్​.

  రూ. 140 కోట్ల వరకు ఖర్చు!

  రూ. 140 కోట్ల వరకు ఖర్చు!

  అయితే ఇందుకు టైగర్​ ష్రాఫ్​ ససెమిరా అన్నాడని సమాచారం. దీంతో ఈ సినిమా చిత్రీకరణను నిలిపివేసినట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నటీనటుల రెమ్యునరేషన్​తో కలుపుకుని సినిమా నిర్మాణానికి మొత్తంగా సుమారు రూ. 140 కోట్ల వరకు ఖర్చు కానుందట. దీంతో బాలీవుడ్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను బట్టి సినిమా చిత్రీకరణను ఆపినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అఫిషియల్ స్టేట్​మెంట్ ఇప్పటివరకు రాలేదు. కానీ, టైగర్ చేసిన పనికి పాపం రష్మిక అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

  English summary
  National Crush Rashmika Mandanna And Bollywood Young Hero Tiger Shroff Screw Dheela Movie Has Been Stopped Due To High Remuneration.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X