మరోసారి విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా.. చిత్రం డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ లో ప్రస్తుతం బెస్ట్ పెయిర్ అండ్ మోస్ట్ అవైటెడ్ ఆన్ స్క్రీన్ పెయిర్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న అని చెప్పాలి. వీరు కలిసి చేసినవి కేవలం రెండు చిత్రాలే అయినా.. తెలుగు ఆడియెన్స్ లో మంచి పేరు సంపాదించుకున్నారు. బెస్ట్ కాంబినేషన్ అంటే వీరిదే అని, ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో దుమ్ములేపుతారని ఆడియెన్స్ ఇప్పటికే ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే వీరి కాంబోలో మళ్లీ సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ సినిమాలు..
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ సౌత్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఆ చిత్రం తర్వాత సెన్సేషనల్ స్టార్ గా ఎదిగారు. అర్జున్ రెడ్డి తర్వాత మంచి సక్సెస్ ను అందించిన సినిమా ఏదైనా ఉందంటే.. అది గీతా గోవిందం. ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుందీ చిత్రం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తే నిజమైన ప్రేమికులలా తమ పాత్రల్లో జీవించి పోయారు. అలా వీరి కలయికలో మొదటి ప్రాజెక్ట్ భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ వచ్చినా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు.

మళ్లీ జంటగా రష్మిక, విజయ్..
ఎప్పటి నుంచో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ మళ్లీ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ లవ్లీ ఆన్ స్క్రీన్ పెయిర్ ను వెండితెరపై చూసి ఆనందించాలని ఇప్పటికే అభిమానులు పలు సందర్భాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కరోనా తర్వానే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని సినీ సర్కిల్ లో గట్టిగా ప్రచారం జరిగింది. కానీ అప్పుడు అవ్వలేదు. మళ్లీ ఇప్పుడు విజయ్, రష్మిక మరోసారి కలిసి నటంచేందుకు సిద్ధంగా ఉన్నారంటూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ అయ్యింది.
రష్మిక, విజయ్ సినిమాకు దర్శకుడు ఎవరు?
ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు చెబుతున్న వివరాల ప్రకారం విజయ్ దేవరకొండ రష్మిక మందన్న మరోసారి కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నారంట. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన రాహుల్ సంకృత్యన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ స్కేల్లో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.
రష్మిక, విజయ్ రాబోయే చిత్రాలు..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస చిత్రాలతో మొన్నటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. యానిమల్, పుష్ఫ2, ఛావా వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తో మరింత క్రేజీయేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. నెక్ట్స్ కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్, థామా వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక విజయ్ దేవరకొండ 'కింగ్డమ్ చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మే30న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











