Vijay- Rashmika Wedding Cost: విజయ్- రష్మిక రాయల్ వెడ్డింగ్.. 3 రోజుల పెళ్లికి ఖర్చు ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ స్టార్స్ రష్మిక మందన్న - విజయ్ దేవరకొండలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఉదయం తెలుగింటి సాంప్రదాయం ప్రకారం 10.10 నిమిషాలకు జరగ్గా.. సాయంత్రం కొడవ సాంప్రదాయం ప్రకారం రష్మిక - విజయ్‌లు పెళ్లి చేసుకున్నారు. తద్వారా ఇన్నిరోజులుగా వస్తోన్న ఊహాగానాలకు చెక్ పడినట్లయ్యింది. ఇదిలాఉండగా.. ఈ మూడు రోజుల పెళ్లికి ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది? అనేది సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ వివరాల్లోకి వెళితే..
రష్మికతో పెళ్లిపై విజయ్ దేవరకొండ తొలిసారిగా స్పందించారు. ఆమెను పెళ్లాడబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన ఆయన ఈ పెళ్లికి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే పేరు పెడుతున్నట్లు తెలిపారు. అనంతరం రష్మికతో కలిసి ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. నగరంలోని ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న అందమైన ది మెమొంటోస్ లగ్జరీ హోటల్ వీరి పెళ్లికి వేదికైంది. ఫిబ్రవరి 24వ తేదీన సాయంత్రం సంగీత్‌తో విజయ్ - రష్మికల పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం హల్దీ, సాయంత్రం మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం తెలుగు, కొడవ సాంప్రదాయాల ప్రకారం రష్మిక- విజయ్‌లు రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు.

ఇక ఈ పెళ్లి కోసం రష్మిక- విజయ్‌లు ఎంత ఖర్చుపెట్టారు? హోటల్‌లో వసతి ఏర్పాట్ల నుంచి భోజనాలు, పెళ్లి బట్టలు, నగలు, రవాణా సదుపాయాలు ఇలా ప్రతిదానికి ఎంతైంది? అనే విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్, రష్మికల నగలు, వస్త్రధారణ అచ్చంగా రాజుల కాలం నాటి నగలను పోలి ఉన్నాయి. పట్టు పంచెతో పాటు ఎరుపు రంగు అంగ వస్త్రంతో విజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ తన చేతికి కడియాలు, కాళ్ల కంకణాలు, కంఠాభరణాలను రాజుల కాలం నాటి నగలను ధరించారు.
ఇక రష్మిక విషయానికి వస్తే.. ఎరుపు రంగు చీరలో, గోల్డ్ బోర్డర్‌తో రూపొందించిన 9 గజాల చీరను కట్టుకుని మెరిసిపోయారు. రష్మిక అరవంకీలు, జుంకాలు, జడ బిళ్ల, చెంప సవరాలు, గాజులు, వడ్డాణం, పాపిట బిళ్ల, ముక్కు పుడకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దక్షిణ భారతదేశానికి చెందిన ఓ ప్రఖ్యాత ఆభరణాల సంస్థ వీటిని తయారు చేసింది. వీటి తయారీకి ఏకంగా 10 నెలల సమయం పట్టిందని వార్తలు వస్తున్నాయి. ఈ కష్టం విజయ్ - రష్మికల పెళ్లిలో స్పష్టంగా కనిపించింది.
పెళ్లికి విచ్చేసిన అతిథుల కోసం మెనూని కూడా జాగ్రత్తగా ఎంపిక చేశారు విజయ్ - రష్మిక. ఆంధ్రా- తెలంగాణ ఫేమస్ వంటకాలైన నాటుకోడి పులుసు, గారెలు, హైదరాబాదీ దమ్ బిర్యానీ, పచ్చి పులుసు, ఖీమా సమోసలు.. అలాగే రష్మిక సొంతూరి నుంచి కొడవ రుచులైన రైస్ బాల్స్, పాండి కర్రీ, నూల్‌పుట్టుతో పాటు జపనీస్ వంటకాలను ప్రత్యేకంగా వడ్డించారు.
అన్నింటిలోకి పెళ్లి వేదికగా నిలిచిన మెమొంటోస్ హోటల్ మరింత ప్రత్యేకం. ఉదయ్‌పూర్ నగరానికి దూరంగా ఆరావళి పర్వత సానువుల్లో నిర్మితమైన ఈ హోటల్ దాదాపు 45 మీటర్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 117 గదులతో విస్తరించి ఉంది. ఇందులో స్టాండర్డ్ రూమ్స్ ధరలు ఒక్క రాత్రికి 20 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయలు. అలాగే ప్రైవేట్ విల్లా ధర ఒక్కరాత్రికి 70 వేల రూపాయలు. దానితో పాటు లగ్జరీ వెడ్డింగ్ ఖర్చు 90 లక్షల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయలు (ఇందులో వసతి, భోజన వసతులు, డెకరేషన్ ఖర్చులు కలిపి). అలా మొత్తంగా ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు అక్షరాల 4 నుంచి 6 కోట్ల రూపాయల రేంజ్‌లో ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











