బాలీవుడ్ తెరపై రష్మిక మందన్న.. కన్ఫర్మ్ చేసిన కరణ్ జోహార్!
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పై బాలీవుడ్ దర్శకనిర్మాతల కన్ను పడింది. తెలుగు తెరపై వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న రష్మిక మందన్నను తన సినిమాలో తీసుకోవడానికి కన్ఫర్మ్ అయ్యారట కరణ్ జోహార్. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
'ఛలో' సినిమాతో తెలుగు తెరపై కాలుమోపిన రష్మిక మందన్న ఆ తర్వాత గీత గోవిందం సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన 'డియర్ కామ్రేడ్' సినిమా ద్వారా అలరించింది. అలాగే ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో, అల్లు అర్జున్ సరసన మరో సినిమాలో, నితిన్ భీష్మ హీరోయిన్‌గా నటిస్తోంది రష్మిక మందన్న.

ఇలాంటి తరుణంలో బాలీవుడ్ తెరపై కూడా రష్మిక మందన్నతో మ్యాజిక్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయట. తెలుగులో నాని హీరోగా వచ్చి భారీ సక్సెస్ సాధించిన జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్‌ని హీరోగా తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఆయన సరసన హీరోయిన్‌గా రష్మికను నటింప చేయాలని నిర్మాత కరణ్ జోహార్ భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆమెకున్న క్రేజ్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయనేది ఆయన ఆలోచనట. ఇదే నిజమైతే అనతికాలంలో రష్మిక టాప్ స్టార్‌గా కీర్తించబడటం ఖాయం.


Click it and Unblock the Notifications











