ఎవ్వరూ ఊహించని రోల్‌లో రష్మిక మందన్నా.. విజయ్‌తో పెళ్లికి ముందు షాకింగ్ ట్విస్ట్!

నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) వరుస విజయాలతో దూసుకుపోతుంది. మల్టీటాలెంటెడ్ నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కన్నడలో కెరీర్ ప్రారంభించి, టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్న రష్మిక..ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పుష్ప (Pushpa) సినిమా తర్వాత ఆమె కెరీర్ పూర్తిగా టర్నింగ్ పాయింట్ తీసుకుంది. ప్రస్తుతం హిందీలోనూ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న రష్మిక, ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రతో వార్తల్లో నిలిచారు.

తాజాగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న కాక్ టెయిల్ 2 (Cocktail 2) గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా నటిస్తుండగా, హీరోయిన్లుగా క్రుతి సనన్ (Kriti Sanon), రష్మిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం..ఈ సినిమాలో కృతి సనన్, రష్మిక ఇద్దరూ స్వలింగ ప్రేమికులుగా (లెస్బియన్ క్యారెక్టర్స్) కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కథ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది.

Rashmika Mandanna s Shocking New Role in Cocktail 2 Lesbian Character Rumours Go Viral

ఈ సినిమాకి హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల జనవరి 31న షూటింగ్ పూర్తయినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని దర్శకుడు పేర్కొనగా, విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అలాగే షాహిద్ కపూర్ ఇందులో ఇప్పటివరకు చూడని డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం. 2012లో విడుదలైన కాక్ టెయిల్ (Cocktail)కు ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. ఆ సినిమాలో దీపిక పదుకొణె, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో కథలు చెప్పే విధానం మారిపోయింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకంటే వైవిధ్యమైన కథలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. అలాంటి సమయంలో రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ లెస్బియన్ పాత్ర చేస్తుందన్న వార్త మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలీవుడ్‌లో అప్పుడప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్ టచ్ చేసినా.. దక్షిణాదిలో మాత్రం స్టార్ హీరోయిన్లు ఇలాంటి పాత్రలు చేయడం అరుదు. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే.. రష్మిక కెరీర్‌లో ఇది అతిపెద్ద ప్రయోగంగా నిలవనుంది.

ఇక మరోవైపు రష్మిక వ్యక్తిగత జీవితం గురించిన రూమర్లు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక కు రిలేషన్ ఉందన్న వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. గతేడాది రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. ఈ నెల ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం ఈ టాక్ బాలీవుడ్, టాలీవుడ్ రెండింటిలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉంటే..ఈ మూవీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక క్లారిటీ రాకపోయినా.. ఒకవేళ ఇదే నిజమైతే..రష్మిక మందన్న కెరీర్‌లో ఇది మరో కీలక మైలురాయిగా నిలవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X