twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ కృష్ణవంశీకి కమిట్ అయిన రాశి!?

    By Srikanya
    |

    ఒళ్ళు పెంచి ఫేడవుట్ అయిన రాశి తాజాగా కృష్ణవంశీ లేటెస్ట్ చిత్రం కమిట్ అయ్యిందని సమాచారం. రవితేజ హీరోగా బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కందిరీగ అని వర్కింగ్ టైటిల్ గా వ్యవహిస్తున్నారు. ఇక కృష్ణవంశీ గత చిత్రం సముద్రంలో ఆమె రెచ్చిపోయి చేసిన సాంగ్ ని దృష్టిలో పెట్టుకునే ఓ కీలకమైన పాత్రకు ఆమెను ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. అందులోనూ శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ చిత్రం వెంకీలోనూ ఆమె చేసిన ఐటం సాంగ్ అప్పట్లో ఓ సంచలనమే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆమెకీ రీ ఎంట్రీ ఇచ్చినట్లుంది. ప్రస్తుతం రాశి సన్నబడే ప్రాసెస్ లో పడింది.

    ఇక 'కందిరీగ' అనే చిత్రం పూజా కార్యక్రమాలు కొద్ది నెలల క్రిందట జరిగాయి. కానీ ఈ చిత్రం షూటింగ్ మాత్రం జనవరిలో మొదలవనున్నది. చారిత్రక నేపథ్యంలో సోషియో ఫాంటసీగా రూపొందనున్న ఈ కందిరీగ చిత్రంలో రవితేజ శ్రీకృష్ణ దేవరాయులు ముని..ముని మనవడుగా కనిపించనున్నాడు. ఆ గొప్ప చక్రవర్తి వారసుడు ఈ కాలంలో ఏం చేస్తున్నాడు అన్నదానికి ఓ బర్నింగ్ ఇష్యూని ముడేసి కృష్ణవంశి సినిమా చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. పూర్తి స్దాయి ఎంటర్టైనర్ గా సాగే ఈ కథలో రవితజ రెగ్యులర్ విరుపులకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. ఈ చిత్రం వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

    ఈ కందిరీగ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు. ఆయన ప్రస్తుతం రవితేజ తో నానోడిగల్ చిత్రం రీమేక్ శంభో..శివ..శంభో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సముద్ర ఖని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రవితేజతో పాటు అల్లరినరేష్ కూడా కనిపించనున్నాడు. 2010 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X