ఉషాకిరణ్ మూవీస్ 'గయ్యాలి అత్త'?

By Staff

Ravi Babu
గతంలో విజయవంతమైన ఎన్నో చిత్రాలను రూపొందించిన ఉషాకిరణ్‌ మూవీస్ ఆ మధ్య "వీధి" అనే చిత్రాన్ని నిర్మించింది.అయితే ఆ సినిమా ఘోరమైన పరాజయం పొంది విమర్శలు పాలవటంతో మళ్ళా సినిమా నిర్మాణం చేయలేదు.అయితే ఇన్నాళ్ళకి మళ్ళీ మరో సినిమాతో ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు నటుడు దర్శకుడు అయిన రవిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే "అనసూయ" చిత్రంతో హిట్ ని సాధించిన రవి ఈ సినిమాను అంతా కొత్త వాళ్ళతో నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారుట.

అయితే ఉషాకిరణ్ యాజమాన్యం ఈ చిత్రంలో అందరూ కొత్తవారు కావడంతో స్క్రిఫ్ట్ అంతా నటీనటుల మనస్సులోకి ఎక్కాకనే సెట్‌పైకి తీసుకెళ్లాలని,రిహార్సల్స్ చేయంచాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోప్రక్క అంతా రెడీ అయిందనీ,ఈ నెల 18న రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు "గయ్యాలి అత్త" అనేపేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. టైటిల్ పాత్రను ప్రముఖ నటి నటింబోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X