సుమంత్ దర్శకుడుతో బాలకృష్ణ చిత్రం
శ్రీరామరాజ్యం హిట్ టాక్ తో ఉషారుగా ఉన్న బాలయ్య మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పారని సమాచారం.సుమంత్ తో దగ్గరగా దూరంగా చిత్రం చేసిన రవిచావలి ఈ చిత్రానికి దర్శకుడు.ఈ మేరకు రవి చావలి కొద్ది రోజుల క్రితం బాలయ్యకు స్టోరీ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడని తెలుస్తోంది.అంతేగాక త్వరలోనే రవిచావలి డైరక్ట్ చేసిన సామాన్యుడు చిత్రం కూడా చూస్తానని బాలకృష్ణ చెప్పారని,దాంతో రవిచావలి ఉత్సాహంతో స్క్రిప్టు పనిలో ఉన్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.అయితే ఎవరు నిర్మిస్తారు ఎప్పటినుంచి ప్రారంభమవుతుందనే విషయాలు ఇంకా తెలియరాలేదు.ఇక ప్రస్తుతం బాలకృష్ణ..తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఉన్నారు.అక్కడ ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం షూటింగ్ లో పాల్గొంటన్నారు.ఈ చిత్రంలో బాలకృష్ణ ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు.ఆయన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.ఆయన సీన్స్ కోసం హైదరాబాద్‌లో ఆరున్నర కోట్ల రూపాయల వ్యయంతో భారీ సెట్‌ని తీర్చిదిద్దారు.ఏప్రిల్ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.అలాగే బాలకృష్ణ మరో చిత్రం అధినాయకుడు కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతోంది.


Click it and Unblock the Notifications











