నితిన్ నెక్ట్స్ ఆ దర్శకుడుతో ఖరారు
హైదరాబాద్ : రీసెంట్ గా విడుదలైన చిన్నదాన నీ కోసం చిత్రం నిరాశపరచటంతో నితిన్ తన తదుపరి చిత్రం హిట్ కోసం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా పిల్లా నువ్వు లేని జీవితం తో హిట్ కొట్టిన ఎ.ఎస్ రవికుమార్ చౌదరితో మందుకు వెళ్తున్నట్లు సమాచారం. రీసెంట్ గా రవికుమార్ చౌదరి వినిపించిన స్క్రిప్టుని ఓకే చేసిన నితిన్..ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెల్సుతోంది.
అందుతున్న సమాచారం ప్రకారం రవికుమార్ చౌదరి...ఈ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు చెప్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ప్రొడక్షన్ బిజీలో ఉన్న నితిన్...కాస్త బ్రేక్ రాగానే ఈ చిత్రం పట్టాలు ఎక్కించనున్నారు. తన తండ్రి సుధాకర రెడ్డి పెద్ద నిర్మాత అయినప్పటికీ తనే పూర్తిగా ఈ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు.
ఇక మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ అఖిల్ తొలి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువ హీరో నితిన్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ... ‘గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నేను హీరోగా పరిచయమవుతున్నాను. నా డార్లింగ్ ప్రొడ్యూసర్ నితిన్ & సుధాకర్ రెడ్డిలకు అల్ ది బెస్ట్. వీరితో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం అయినందుకు క్షమించండి.' అని అన్నారు.

నిర్మాత నితిన్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించే అవకాశాన్ని మా చేతుల్లో పెట్టినందుకు నాగార్జున గారికి మరియు నా సోదరుడు అఖిల్ కు థాంక్స్. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. భారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి. అని అన్నారు.
ఇక అక్కినేని అఖిల్ ను హీరోగా పరిచయం చేసే భాధ్యతను తనపై ఉంచిన నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని దర్శకుడు వివి వినాయిక్ తెలిపారు. శ్రీ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
వినాయిక్ మాట్లాడుతూ... ఫ్యాంటసీ నేపధ్యంలో సాగే ప్రేమ కథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్బుతమైన స్క్రిప్టు ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాధోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలెడతాం. అభిమానులు కోరుకునే మాస్,మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయి అన్నారు.
మరో ప్రక్కన ఇంకా హీరోగా అరంగేట్రం చేయకుండానే అక్కినేని అఖిల్‌కు ఫాలోయింగ్ ఎక్కువైంది. ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు. అఖిల్‌కు అంత క్రేజ్ ఉంది కాబట్టే టైటాన్ వాచ్ కంపెనీ, మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు అఖిల్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











