రవితేజ మరో మల్టీస్టారర్.. మెగా హీరోతో డీల్ సెట్టయిందట?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా గట్టిగానే కొనసాగుతోంది. సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు ప్రతి ఒక్కరు మల్టీస్టారర్ సినిమాలంటే ఏ మాత్రం నో చెప్పడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్ బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక త్వరలో రవితేజ కూడా మరో మెగా హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది.

Recommended Video

Ravi Teja & Sai Dharam Tej To Team Up For Multi-Starrer
త్రినాధ రావ్ నక్కినతో..

త్రినాధ రావ్ నక్కినతో..

సినిమా చూపిస్త మామ, నేను లోకల్ వంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న దర్శకుడు త్రినాధ రావ్ నక్కిన త్వరలో రవితేజతో ఒక సినిమా చేయనున్నట్లు టాక్ వస్తోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య కథా చర్చలు నడుస్తున్నాయనే టాక్ వస్తోంది. లాక్ డౌన్ అనంతరం వీలైనంత త్వరగా రవితేజతో సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

మెగా హీరో ముఖ్యమైన పాత్రలో..

మెగా హీరో ముఖ్యమైన పాత్రలో..

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. కథను మలుపు తిప్పే విధంగా ఉండే ఆ పాత్ర కోసం దర్శకుడు గత కొన్ని రోజులుగా చాలా మంది హీరోలను సంప్రదించాడట. కానీ ఫైనల్ గా సాయి ధరమ్ తేజ్ ని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

 రెమ్యునరేషన్ లేకుండానే..

రెమ్యునరేషన్ లేకుండానే..

ఈ విషయంలో మరొక ఇంట్రెస్టింగ్ రూమర్ కూడా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ రవితేజ సినిమాలో కనిపించడానికి ముందుగా ఎలాంటి రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదట. లాక్ డౌన్ లో నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదని ఇప్పుడే రెమ్యునరేషన్ గురించి ఎలాంటి విషయాలు మాట్లాడవద్దని సినిమా బిజినెస్ తరువాత మాట్లాడుకుందాం అని క్లారిటీ ఇచ్చాడట.

సాయి ధరమ్ తేజ్ బ్యాడ్ సెంటిమెంట్..

సాయి ధరమ్ తేజ్ బ్యాడ్ సెంటిమెంట్..

గతంలో సాయి ధరమ్ తేజ్ నక్షత్రం సినిమాలో కూడా ఇదే తరహాలో కొన్ని నిమిషాల పాటు ముఖ్య పాత్రలో కనిపించాడు. కానీ ఆ సినిమా అంతగా క్లిక్కవ్వలేదు. ఇక ఇప్పుడు అదే తరహాలో రవితేజ సినిమాలో కనిపించడానికి సిద్దమవుతున్న ఈ మెగా హీరోని బ్యాడ్ సెంటిమెంట్ కాస్త ఇబ్బంది పెడుతోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X