మాస్ రాజా రవితేజ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ఆ ఇద్దరికి పవర్ఫుల్ విలన్ గా మంచు హీరో!
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా రవితేజ మూవీస్ వస్తున్నాయి. ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
తరువాత రావణాసుర మూవీతో వచ్చి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇప్పుడు మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అందులో పవర్ఫుల్ విలన్ గా మంచు హీరోగా నటించబోతున్నట్లు కొత్త టాక్ వస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో దసరా బరిలో మరల పాన్ ఇండియా లెవల్ లో రాబోతున్నారు.ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రవితేజ కెరియర్ లో మొదటి సారి పీరియాడిక్ జోనర్ లో బయోపిక్ కథని చేశారు. రియల్ లైఫ్ రాబిన్ హుడ్ గా పేరుపొందిన దొంగ కథగా ఈ చిత్రం సిద్ధం అవుతోంది. కార్తిక్ ఘట్టనమేని దర్శకత్వంలో ఈగల్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ థ్రిల్లర్ యాక్షన్ గా తెరకెక్కుతోంది.
రీసెంట్ గా కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ తో మూవీచేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. ఈ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ మరో హీరోగా నటించబోతున్నాడంట. అతని పాత్ర చాలా కీలకంగా ఉంటుందని టాక్.
అలాగే మంచు విష్ణుని ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్ర కోసం ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. అతను కూడా స్టొరీ నచ్చి ఒక్కే చెప్పారంట. చాలా రోజులుగా మంచు మనోజ్ విలన్ పాత్రలకి నేను సిద్ధం అని చెబుతున్నారు. ఇప్పుడు రవితేజ మూవీ కోసం సందీప్ రాజ్ అతన్ని ఎంపిక చేయడం జరిగిందంట.
త్వరలో ఈ చిత్రానికి సంబందించిన అఫీషియల్ ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల మాట. మొత్తానికి మాస్ మహారాజ్ తో పాటు మరో ఇద్దరు యంగ్ స్టార్స్ భాగస్వామ్యం కావడంతో సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని ఏదో స్పెషల్ గా పాన్ చేస్తున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లోనే ఆవిష్కరించే ప్రయత్నం చేయనున్నారంట.


Click it and Unblock the Notifications











