‘శక్తి’దెబ్బతో కన్ఫ్యూజన్ లో ఉన్న జూ ఎన్టీఆర్ కి రవితేజ మరో దెబ్బ..
'భద్ర" సినిమాతో దర్శకుడైన బోయపాటి శ్రీను, బాలకృష్ణతో 'సింహా" సినిమా తెరకెక్కించి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైపోయాడు. ఏం లాభం..?'సింహా" తర్వాత ఇప్పటిదాకా బోయపాటి తదుపరి ప్రాజెక్ట్ 'ఫైనలైజ్" కాలేదు. ఆ మధ్య జూ ఎన్టీఆర్ తో ఓ సినిమా లాంఛనంగా ప్రారంభమైనా, అదిప్పుడు కష్టాల్లో పడిందట. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ఓ సినిమాకి కమిట్ అయిన జూ ఎన్టీఆర్, 'శక్తి" దెబ్బతో కన్ ఫ్యూజన్ లో పడిపోయాడు.
ఆ కన్ ఫ్యూజన్ కారణంగానే బోయపాటిని జూ ఎన్టీఆర్ లెక్కచేయట్లదనీ, దాంతో డీలాపడ్డ బోయపాటి, ఎన్టీఆర్ కి చెప్పిన కథనే రవితేజకు వినిపించాడని, రవితేజ బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనీ ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ లో. పోన్లే..ఇలాగైనా బోయపాటి కెరీర్ ముందుకెళ్తుందంటూ బోయపాటి గురించి కామెంట్లు వేసుకుంటున్నారు టాలీవుడ్ జనం.


Click it and Unblock the Notifications











