మళ్ళీ పట్టుబడిన రవితేజ బ్రదర్స్ కి పదేళ్ల జైలు శిక్ష...?
సినీనటుడు రవితేజ సోదరులు భరత్ రాజు, రఘునాథ రాజు, వీళ్ల ప్రెండ్ నరేష్ లు ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. క్లెమెన్ అనే నైజీరియన్ నుంచి కొకైన్ అనే మాదక ద్రవ్యం కొనుగోలు చేస్తుండగా పోలీసులు వారిని రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రవితేజ సోదరులు, నరేష్ నుంచి 11గ్రాములు, క్లెమెన్ నుంచి 40 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు.
కాగా మాదక ద్రవ్యాల నిరోదక చట్టం ప్రకారం శిక్షలు(వాడినా, అమ్మినా, సరఫరా చేసినా) రెండు గ్రాములు, లేద అంతకంటే తక్కువ: సాధారణ జరిమాన(రూ.10వేలు) రెండు గ్రాములకంటే ఎక్కువ దొరికితే: గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా, 100గ్రాములు కంటే ఎక్కువ ఉంటే: పదేళ్లకు తక్కువ కాకుండా గరిష్టంగా 20ఏళ్ల వరకు జైలు శిక్షపడొచ్చు.
అయితే పోలీసుల లెక్క ప్రకారం రవితేజ సోదరుల వద్ద ఉన్న కొకైన్ ముగ్గురికి మూడు భాగాలు చేయగా..ఒక్కొక్కరి ఖాతాలోకి దాదాపు మూడున్నర గ్రాముల కొకైన్ వచ్చింది చట్ట ప్రకారం దీనికి పది, పదేళ్ల జైలు శిక్షపడొచ్చంటున్నారు న్యాయ నిపుణులు. అయితే రవితేజ సోదరులను చట్టంలోని లొసుగుల ఆధారంగా శిక్ష నుంచి తప్పించడానికి భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. 2గ్రాములు మాత్రమే వారి ఖాతాలోకి వేసి మిగిలిన 5గ్రాములు క్లెమెన్ ఖాతాలోకి మార్చి వారిని బయటకు తేవడానికి పైరవీలు జరుగుతున్నాయట.


Click it and Unblock the Notifications











