డ్రగ్ స్కాండిల్ లో హీరో రవితేజ సోదరులు అరెస్ట్
రవితేజ సోదరులు రఘు,భరత్ లు డ్రగ్ స్కాండిల్ కేసులో రోడ్ నెంబర్-3,బంజారాహిల్స్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్లు సమాచారం. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అరెస్టు అయిన సమయంలో వీళ్లతో పాటు ఇద్దరు నైజీరియన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సోదరులు వాడిన కారు తమ అన్న రవి శంకర రాజు అలియాస్ రవితేజ పేరు మీద రిజిస్టర్ అయిఉంది. రిజిస్ట్రేషన్ నెంబర్ AP 13 L 8999. ఇక కొంతకాలంగా మీడియాలో రూమర్స్ లా డ్రగ్ స్కామ్ లో వీళ్లు పేర్లు వినపడుతునే ఉన్నాయి. ఇక వీరు ఈ స్కామ్ లో ఉన్న మరికొంత మంది సినీ ప్రముఖుల పేర్లు బయిటపెట్టారని చెప్పుకుంటున్నారు. గతంలోనూ రఘు త్రాగి పోలీసులతో గొడవ పడటం అరెస్టులు జరిగిన సంగతి తెలిసందే. ఇక రఘు చాలా సినిమాల్లో నటించాడు. అతను హీరోగా సారి నాకు పెళ్ళయింది,ప్లీజ్ నాకు పెళ్ల్ళయింది చిత్రాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











