మొత్తానికి రవితేజ బ్లాక్ మనీ ని అలా వైట్ చేసాడా?
మొన్నీమధ్య ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్స్ అనూష్క,నాగార్జున,రవితేజ వంటి వారి ఇళ్ళపై దాడి చేసిన సంగతి తెలిసిందే.అయితే ఎక్కడ ఎంత పట్టుబడిందీ బయిటకు రాలేదు.తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న టాక్ ప్రకారం రవితేజ ఇరవై కోట్ల రూపాయలకు లెక్క చూపించలేకపోయాడని చెప్తున్నారు.
దాంతో మూడున్నర కోట్లరూపాయలు పెనాల్టి కట్టి ఆ ఇరవైని వైట్ చేసుకున్నాడని అంటున్నారు.ఇక వరసగా సినిమాలు చేసుకుపోతున్న రవితేజ లెక్కలు ఇంతకుముందు రాజా రవీంద్ర చూసేవారు.అతను మేనేజర్ గా మానేసాక వేరే వ్యక్తిని తీసుకున్నారు.ఇక ప్రస్తుతం రవితేజ..వీర చిత్రం చేస్తున్నారు.రీసెంట్ గా అతను వర్మ దర్శకత్వంలో నటించిన దొంగల ముఠా చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











