రవితేజ కొత్త చిత్రం 'డాన్ శీను' లేటెస్ట్ ఇన్ఫో
రవితేజ హీరోగా రూపొందనున్న 'డాన్ శీను' చిత్రం జనవరి 25న లాంచనంగా పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. గోపీచంద్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అలాగే 'కృష్ణ' చిత్రం తర్వాత త్రిష ఈ చిత్రంలో రవితేజ సరసన మరో సారి కనువిందు చేయనుంది. అలాగే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ పిభ్రవరి 25 నుంచి జరపటానికి ప్లాన్ చేసారు. జూన్ లో ఈ చిత్రం రిలీజ్ ని ప్లాన్ చేసే షూటింగ్ కార్యక్రమాలు జరుపుతున్నారు. శ్రీహరి ఈ చిత్రంలో కీలకమైన పాత్ర చేస్తున్నాడు. సమీర్ రెడ్డి కెమెరా అందిస్తున్నాడు. మణిశర్మ అదరకొట్టే ట్యూన్స్ ని ఇప్పటికే ఈ చిత్రం కోసం రెడీ చేసారుచ. అలాగే రవితేజ తో కిక్ చిత్రం అందించిన తీసి హిట్ కొట్టిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో రవితేజ కథ ప్రకారం అమితాబ్ నటించిన హిందీ 'డాన్' చిత్రానికి వీరాభిమాని. ఎప్పుడూ ఆ చిత్రంలో డైలాగులు చెప్తూ మై హూ డాన్ అని చెప్పుకు తిరుగుతూంటాడు. అలాగే అతని పేరు శీను. దాంతో ఆ ఊళ్ళో వారంతా డాన్ శీను అని ముద్దుగా పిలుస్తూంటాడు. అలా పెరిగి పెద్దయిన రవితేజ ఎప్పటికైనా డాన్ అవ్వాలని కోరికతో ఉంటాడు. ఆ మేరకు తన కోరిక తీర్చుకోవటానికి ముంబయి చేరుతాడు. అక్కడ అప్పటికే ఇద్దరు డాన్స్ ఉంటాడు. అక్కడికి చేరిన రవితేజ తన కోరికను ఎట్లా తీర్చుకుని డాన్ అయ్యాడు అనేది కథ అని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామిడీగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి 'ఢీ' వంటి సూపర్ హిట్ చిత్రానికి కథ అందించిన కోన వెంకట్ రచన చేస్తున్నారు. ఆయన కథ,మాటలు రాసిన 'అదుర్స్' చిత్రం సంక్రాంతికి విడుదల అయ్యిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











