దీక్షాసేధ్ రాత్రింబవళ్లూ ఆ హీరోతోనే...
వేదం చిత్రంతో పరచయమై ఆ తర్వాత వాంటెండ్,మిరపకాయ అంటూ దూసుకుపోతున్న హీరోయిన్ దీక్షాసేధ్. ప్రస్తుతం ఆమె రవితేజతో బాగా చనువుగా ఉంటోంది. రవితేజ ప్రస్తుతం శృంగార దీక్షలో ఉన్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. అదేంటి అంటే దీక్షాసేధ్ తో రవితేజ సెట్లో నే కాక బయిట కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడని, ఇద్దరూ ఎప్పుడు చూసినా కలిసే ఉంటున్నారని, షూటింగ్ అయిపోయాక కూడా ఇద్దరూ కలిసే బయిటకు వెళ్ళుతున్నారని ఫిల్మ్ నగర్ లో వినపిస్తోంది.ఇక మిరపకాయ చిత్రంలో తనతో చేసిన దీక్షాసేధ్ ని రవితేజే రికమెండ్ చేసి నిప్పులో అవకాసమిచ్చాడు.
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న నిప్పుని మరో దర్శకుడు వైవియస్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం నిప్పు కాకుండా దీక్ష... లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రెబల్" లక్ష్మిప్రసన్న నిర్మాతగా మనోజ్‌తో 'ఊ కొడతార ఉలిక్కి పడతారా" చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ సెట్స్‌లో సందడి చేస్తున్నాయి. తమిళంలో విక్రమ్‌తో ఓ సినిమా, శింబుతో ఓ సినిమాలో నటిస్తూ అక్కడా లైమ్‌లైట్‌లో ఉంది. శింబుతో 'వేట్టై మారన్" భారీ యాక్షన్‌తో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ్, హిందీలో ఈ సినిమాని ఏకకాలంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో విక్రమ్‌తో 'రాజపట్టై"లోనూ దీక్షాసేథ్ నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 23న తెలుగు, తమిళ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ టు చెనై్న, చెనై్న టు హైదరాబాద్ ఠంఛనుగా తిరుగాడుతూ..తెగ బిజీగా గడిపేస్తోంది.


Click it and Unblock the Notifications











