ఎన్టీఆర్ డైరక్టర్ తో రవితేజ ఖరారు??
వరస ప్లాపుల్లో ఉన్న రవితేజ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో దమ్ము చిత్రం రూపొందించిన బోయపాటి శ్రీనుతో ఓకే చేసినట్లు సమాచారం. మహేష్ తో ప్రాజెక్టు అనుకున్న బోయపాటి శ్రీను కథ వినిపించినా ఓకే కాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బోయపాటి శ్రీను,రవితేజ కాంబినేషన్ లో భద్ర చిత్రం వచ్చి విజయవంతమైంది. అదే స్పూర్తితో మాస్ ఎంటర్టైనర్ గా రవితేజతో మరో సారి హిట్ కొట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు బోయపాటి శ్రీను.
బోయపాటి శ్రీనుతో చేయటానికి రామ్ చరణ్ ఉత్సాహం చూపించారు కానీ ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కేసరికి చాలా టైమ్ పట్టేటట్లు ఉంది. దాంతో బోయపాటి ఈలోగా రవితేజ తో చిత్రం లాగించేద్దామనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. దమ్ము చిత్రం యావరేజ్ గా నిలిచేటప్పుడికి సింహా తో బోయపాటికి వచ్చిన క్రేజ్ పోయినట్లైంది. హీరోలు బోయపాటి చెప్పే కథలను ఒకటికి నాలుగు సార్లు విని ఖరారు చేసుకుంటున్నారు. అయితే రవితేజకు గతంలో హిట్ ఇవ్వటంతో ఆ నమ్మకంతో బోయపాటి చెప్పిన లైన్ కి ఓకే చేసినట్లు వినికిడి.
ఇక ప్రస్తుతం రవితేజ సారొస్తారు అనే చిత్రం చేస్తున్నారు. పరుశరామ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ఆంజనేయులు చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బలుపు చిత్రం కమిటయ్యారు. విక్రమ్ తో వీడింతే చిత్రం తీసిన నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపిచంద్ మలినేని,రవితేజ కాంబినేషన్ లో గతంలో డాన్ శీను చిత్రం వచ్చి విజయవంతమైంది.


Click it and Unblock the Notifications











