రవితేజకు కులపిచ్చా?

By Staff

గాడ్ ఫాదర్స్ ఎవరూ లేకుండా స్వయం శక్తితో పైకి వచ్చి ఒక ఊపు ఊపుతున్న రవితేజ ప్రత్యేకంగా ఓ వర్గాన్ని తయారుచేస్తున్నాడంటూ అన్ని వైపుల నుంచీ వినపడుతోంది. తన కులం(రాజు)కి సంభందించిన ఫిల్మ్ పర్శనాలటిలందరినీ ఒక త్రాటిపై తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడని అంతటా చెప్పుకుంటున్నారు. అందుకు కృష్ణంరాజు, ప్రభాస్, నిర్మాత అర్జున రాజు, ఎమ్.ఎస్.రాజు, సునీల్, సుబ్బరాజు, రాజా రవీంద్ర(రవితేజ డేట్స్ ఇతనే చూస్తాడు) వారిని కలిపుతున్నాడని వినపడుతోంది. అయితే తలపండిన సీనియర్స్ మాత్రం రవితేజ ఎదుగుదలని చూసి ఓర్వలేని కొందరు కావాలని చేస్తున్న ప్రచారంగా దీన్ని చెప్తున్నారు. పరిశ్రమలో కాస్ట్ గ్రూప్ లు ఉన్నమాట నిజమేనని, అలాగే వారు గ్రూపుగా ఏర్పడి తమ వారిని ఎంకరేజ్ చేయటం చూస్తూనే ఉన్నామని, అయితే ఇది రవితేజ విషయంలో మాత్రం నిజం కాదని అంటున్నారు. ఎందుకంటే వరస సినిమాలు చేసుకుంటూ బిజీ స్టార్ గా ఉన్న రవితేజకు రాజకీయాలు చేయటం గానీ గ్రూపులు కట్టి గాని సినిమాలు పట్టవలిసిన అవసరం లేదని చెప్తున్నారు. అతనికి కులపిచ్చి అనేది ఉంటే ఎప్పుడో అతన్ని అణగతొక్కుదురని, అతనిలోని నిజాయితీ, స్నేహపాత్రతే ఈ స్ధాయికి తెచ్చాయని అతన్ని దగ్గరనుండి ఎరుగున్న వారు విశ్లేషిస్తున్నారు. మరి ఈ రూమర్ ఎందుకు వచ్చింది అంటే కేవలం అతని కెరీర్ ని చూసి ఓర్వలేక దెబ్బతీయటానికే, ఈ రూమర్ నిజమని నమ్మి ఇతర కులాల వారు అతని వద్దకు రాకుండా చేయాలనేదే ఈ రూమర్ పుట్టించిన వారి ఆలోచన అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X