twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ కు బాలీవుడ్ ఆఫర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : బలుపు విజయంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ త్వరలో బాలీవుడ్ కు ప్రయాణం కట్టనున్నారని సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ దర్శకుడు సమీర్ కార్నిక్ (యమాలా పగ్లా దీవానా, హీరోస్..) రవితేజను కాంటాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. రవితేజ డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని త్వరలో బాలీవుడ్ లో తన మార్క్ తో లాంచ్ అవ్వనున్నారని చెప్తున్నారు.

    రవితేజ, శృతి హాసన్ జంటగా పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పివిపి సినిమా పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'బలుపు'. ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 28న విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. ప్రసాద్ వి.పొట్లూరి తమ బేనర్లో నిర్మించిన తొలి తెలుగు చిత్రంతోనే సక్సెస్ సాధించడం గమనార్హం. మరో వైపు బలుపు చిత్రం రవితేజ కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలించిది.


    అలాగే ఓవర్ సీస్ లోనూ ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తోందని చెప్తున్నారు. కలెక్షన్స్ స్టడిగా ఉండటంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. రవితేజ అభిమానులు కూడా చాలా కాలం తర్వాత తాము కోరుకుంటున్నట్లుగా రవితేజను తెరపై చూసి హ్యాపీగా ఫీలయ్యారు. రవితేజ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో కాస్త భయపడుతూనే సినిమాను కొన్న బయ్యర్లు తాజా ఫలితాలతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    రవితేజ మాట్లాడుతూ... ''మాటల్లో వ్యక్తం చేయలేనంత సంతోషంగా ఉన్నాన్నేను. ఈ విజయానికి ప్రధాన కారకుడు పీవీపీ. తెలుగులో తాను నిర్మించిన తొలి సినిమా హిట్ అవ్వడం ఆనందంగా ఉంది. దర్శకునిగా గోపి మరో మెట్టు ఎక్కాడు''అని రవితేజ చెప్పారు.

    దర్శకుడు మాట్లాడుతూ -'' 'బలుపు'కు ముందు రవితేజ నటించిన రెండుమూడు సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. ఆయనకు విజయం రావాలని నాలాంటి దర్శకులు చాలామంది కోరుకున్నారు. ఎందుకంటే ఆయనకు సక్సెస్ వస్తే నా లాంటి ఎందరో దర్శకులకు దారి చూపిస్తారాయన'' అన్నారు. తనకు తెలుగులో మరో విజయాన్ని అందించిన 'బలుపు' చిత్రం యూనిట్‌కి అంజలి కృతజ్ఞతలు తెలిపారు.

    English summary
    Raviteja who is back on success track with Balupu is getting ready to show his skills in Bollywood. In continuation to what he said that he would consider acting in Bollywood if given chance, Bollywood director Samir Karnik contacted Raviteja. Samir earlier directed Heroes, Yamala Pagal films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X