RT74: రవితేజ ఊహించని నిర్ణయం.. గోపీచంద్ బదులు కిర్రాక్ డైరెక్టర్‌తో మూవీ
హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కనీసం ఏడాది రెండు సినిమాలనైనా అందిస్తోన్న అతడు.. ఒకటి పట్టాలపై ఉండగానే మరో ప్రాజెక్టును ఓకే చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య', 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' వంటి చిత్రాలతో వచ్చాడు. ఇందులో మొదటిది మాత్రమే విజయాన్ని సొంతం చేసుకోగా.. తర్వాత వచ్చిన రెండూ ఈ మాస్ హీరోకు నిరాశనే మిగిల్చాయని చెప్పుకోవచ్చు.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'ఈగల్' అనే సినిమాలో నటిస్తోన్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తైపోయింది. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపబోతున్నారు. ఈ క్రమంలోనే రవితేజ ఇటీవలే తన 74వ సినిమాను గోపీచంద్ మలినేనితో చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, అనివార్య కారణాల వల్ల ఇది పట్టాలెక్కకుండానే ఆగిపోయినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

గోపీచంద్ మలినేనితో సినిమా క్యాన్సిల్ అవడంతో రవితేజ తన 74వ సినిమాను హరీశ్ శంకర్‌తో చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే, అతడు ఈ ప్రాజెక్టును 'జాతి రత్నాలు' దర్శకుడు అనుదీప్ కేవీతో చేస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. వాస్తవానికి ఎప్పుడో వీళ్లిద్దరి మధ్య చర్చలు జరిగాయి. కానీ, దీన్ని రవితేజ హోల్డ్‌లో పెట్టాడు. ఇప్పుడు గోపీచంద్ సినిమా ఆగిపోవడంతో అనుదీప్‌ను లైన్‌లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని ఫిలిం నగర్ వర్గాల టాక్.

అనుదీప్ కేవీతో రవితేజ చేయబోయే సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తారని కూడా తెలిసింది. అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా భాటియా లేదా త్రిషను తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ అనుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. దీన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు కూడా ఓ న్యూస్ తాజాగా తెలిసింది.


Click it and Unblock the Notifications











