RT74: టాలీవుడ్‌లో క్రేజీ కాంబో.. కామెడీ డైరెక్టర్‌తో రవితేజ మూవీ
టాలీవుడ్‌లో ఏకధాటిగా సినిమాలు చేస్తూ.. కెరీర్‌ను హిట్లు ఫ్లాపులతో సమాంతరంగా ముందుకు తీసుకు వెళ్తోన్న మాస్ మహారాజా రవితేజ ఒకడు. గత ఏడాది ఆరంభంలోనే భారీ డిజాస్టర్లను చవి చూసిన అతడు.. 'ధమాకా' చిత్రంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన 'వాల్తేరు వీరయ్య' సినిమాలో నటించాడు. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే, ఇటీవలే రవితేజ 'రావణాసుర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా మాత్రం తక్కువ కలెక్షన్లతో డిజాస్టర్‌గా మిగిలింది.
హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'టైగర్ నాగేశ్వర్రావు' అనే సినిమాలో నటిస్తోన్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీనితో పాటు ఈ మాస్ హీరో 'ఈగల్' అనే మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా వేగంగానే జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ తాజాగా మరో క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. రవితేజ తాజాగా 'జాతి రత్నాలు' వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించి.. కామెడీ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న అనుదీప్ కేవీతో సమావేశం అయ్యాడట. ఈ భేటీలో సదరు దర్శకుడు ఓ కామెడీ స్టోరీనే వినిపించాడని తెలిసింది. అంతేకాదు, ఈ కథ మొత్తం హైదరాబాద్, ఢిల్లీ బ్యాగ్‌డ్రాప్‌తో నడుస్తుందని అంటున్నారు. ఇది విన్న వెంటనే అనుదీప్‌కు రవితేజ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని సమాచారం. ఇక, ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఫిలిం నగర్ వర్గాల టాక్.

అనుదీప్ కేవీతో రవితేజ చేయబోయే సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తారని కూడా తెలిసింది. అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా భాటియా లేదా త్రిషను తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ అనుకుంటోందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











