twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ 'అప్పలరాజు' చిత్రంలో ఆ స్టార్ హీరో గెస్ట్ గా...

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ, సునీల్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు' చిత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లో కథ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ చోట ఓ స్టార్ హీరో గెస్ట్ గా కనిపిస్తారని సమాచారం. ఆ స్టార్ హీరో మరెవరో కాదు..వర్మ ప్రస్తుతం ఇష్టపడుతున్న రవితేజ అని తెలుస్తోంది. ఈ చిత్రం జనవరి 19న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతి రోజు అంటే జనవరి 12న విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఓ కీలక సన్నివేశ చిత్రీకరణ లేటవటంతో ఈ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అందులోనూ తెలుగు చిత్ర పరిశ్రమ స్ట్రైక్ లేకుండా ఉన్నట్లు అయితే ముందుగా అనుకున్నట్లు షూటింగ్ పూర్తయ్యేదని చెప్తున్నారు.

    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అప్పలరాజు అని వేయించుకోవటానికి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో వాలిన అప్పలరాజు కథే ఇది. కథ ప్రకారం ...అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే. ఇక తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్‌ వచ్చేసి ఫిల్మ్ ‌నగర్లో వాలిపోయాడు అప్పల్రాజు. ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే.

    అప్పల్రాజు పాత్రలో సునీల్‌ చేస్తున్నారు. స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X