డైరెక్టర్ ని ఊదరగొట్టిన హీరో ఇప్పుడెందుకు కితాబులిస్తున్నాడు..!?
రైడ్ సాధించిన హిట్ తో రవితేజ వంటి కమర్షియల్ హీరోతో 'వీర" చిత్రం చేసే ఛాన్స్ కొట్టేసిన రమేష్ వర్మ ఆ సినిమా రిలీజ్ కాగానే అన్ని ఏరియాల నుంచి నెగటివ్ టాక్ రావడం, సినిమా ప్లాప్ అయిందని టాక్ రావడం జరిగిపోయింది. సినిమా రిలీజ్ అయిన మొదటి వారం రవితేజ కూడా సినిమా ప్రమోషన్ కి రానని మొండికేసాడు. రమేష్ వర్మ డైరెక్టరే కాదు అతనికేం తెలీదు అన్నాడట.
అయితే అదే రవితేజ ఇప్పుడు సినిమా కమర్షియల్ గా బాగా వర్కవుట్ అయిందని బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ అని, అందువల్ల తనూ చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తున్నాడు. పైగా రమేష్ వర్మలో మంచి లీడర్ షిప్ క్వాలిటీస్ వున్నాయని కితాబిస్తున్నాడు. ఇప్పుడు రమేష్ వర్మ తన మూడో సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాడు. 'శ్రీశ్రీ" పేరుతో రూపొందే ఈ చిత్రానికి సంబందించిన కథా చర్చలు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. ఓ యంగ్ హీరో నటించే ఈ చిత్రం త్వరలోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి...


Click it and Unblock the Notifications











