చాటు మాటుగా పనికానించేస్తున్న రవితేజ...?
చాలా లేటు వయసులో హీరోగా బ్రేక్ సాధించిన రవితేజ అతి తక్కువ టైమ్ లోనే ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ రౌండ్ లేకుండా హీరోగా రేంజ్ ని పెంచుకున్నాడు. చాలా స్పీడుగా సినిమాలు చేస్తూ అంతే వేగంగా తన రేటు కూడా పెంచుతూ పోయాడు. మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకోవడంతో నిర్మాతలు కూడా అతనికి అడిగినంత ఇస్తూ వచ్చారు. కానీ వయసు మీద పడుతూ వుండడంతో మునుపటి వేగాన్ని కొనసాగించడం రవితేజ వల్ల కావడంలేదట.
విరామం లేకుండా పని చేయడం కారణంగా ఎప్పట్నుంచో అతడిని మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పితో బాధ పడుతున్నట్టు సమాచారం. ఈ బాధ వలన భారీగా పైట్లు, డాన్సులు కూడా చేయలేకపోతున్నాడని ఫిల్మిం నగర్ లో వినిపిస్తోంది. మాస్ ఫాలోయింగ్ ఘనంగా వున్న రవితేజ సినిమాల్లో అవి రెండూ తప్పకుండా వుండాలి కాబట్టి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అవి పెద్ద ఎత్తున వుండాల్సిందేనని ఇన్ సిస్ట్ చేస్లూ వుంటే, తప్పనిసరి పరిస్థితుల్లో చాటుమాటుగా పెయిన్ కిల్లర్స్ తో పని కానిస్తున్నాడని తెలుస్తోంది. ఏదేమైనా మున్ముందు రవితేజ సినిమాల సంఖ్య తగ్గించుకోవడం ఖాయమని సినీ ఇండస్ట్రీలో టాక్. రవితేజని అభిమానించే వారందరికీ చేదు వార్తే ఇది. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ డాన్ శీను చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో రవితేజ సరసన అనుష్క కథానాయికగా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











