రవితేజ ఇమేజ్ ని డామేజ్ చేస్తున్న ఆ ఇద్దరూ...
రవితేజ మిరపకాయ్ రీసెంట్ గా విడుదలై మొదటి రోజు ఆవెరేజ్ టాక్ తో మొదలైనా మాస్ ని బాగా ఆకట్టుకోవడంతో ఈ రోజుటి వరకు కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టించింది. తర్వాత వెంటనే 'వీర" షూటింగ్ మొదలెట్టేసాడు ఇలా రవితేజ సినిమాలు మీద సినిమాలు చేసుకొంటూ హిట్లు మీద హిట్లు కొడుతూ తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తుంటే అతని తమ్ముళ్లు మాత్రం రవితేజకి ఎంత చెడ్డపేరు తేవాలో అంత చెడ్డ పేరు తెస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు చిన్న గొడవలు, యాక్సిడెంట్లతో రవితేజను అభాసుపాలు చేశారు. ఆ తర్వాత డ్రగ్ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఆ మధ్య భరత్ తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్ తో సహా దొరికిపోయాడు. మామూలుగానే ఒక న్యూస్ ని వందసార్లు చూపించే ఛానల్స్ వారు ఇలాంటి న్యూస్ దొరికితే వదులుతారా? రోజంతా అదే చూపిస్తారు. తాజాగా డ్రగ్ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన ఈ సోదరులిద్దరు మీడియాపై విరుచుకుపడ్డారు. కేసు విషయం వారితో మాట్లాడేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను బండబూతులు తిడుతూ వెళ్లిపోయారు. దీన్ని కూడా పదే పదే టివిలో చూపించారు. సోదరుల వ్యవహారం తలనొప్పిగా మారడంతో తలపట్టుకుని కూర్చున్నాడు రవితేజ.


Click it and Unblock the Notifications











